CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 2న జూలూరుపాడు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ లలో గులాబీ జెండా పండుగ జరపాలి.. మండల పార్టీ అధ్యక్షులు చౌడo నరసింహారావు పిలుపు...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 31, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ మరియు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ సూచనల మేరకు జూలూరుపాడు మండలం లోని అన్ని గ్రామల్లో అన్ని గ్రామ పంచాయితీలలో వార్డు, ల్లో సెప్టెంబర్ 2న గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయని అన్నారు. దానిలో భాగంగా సెప్టెంబర్ 2న అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకట్ రెడ్డి, ఎంపీపీ శ్రీమతి లావుడ్యా సోనీ, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, జూలూరుపాడు ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, సీనియర్ నాయకులు యాదళ్ల పల్లి వీరభద్రం, రామిశెట్టి నాగేశ్వరావు, బానోత్ ధర్మ నాయక్, తోట శ్రీను, ధరావత్ రాంబాబు, ఏ ఎం సి డైరెక్టర్ హలవత్ నరసింహారావు, బొజ్య తండ సర్పంచ్ లావుడ్యా కిషన్ లాల్,లేళ్ల గోపాల్ రెడ్డి, ధరావత్ లక్ష్మీనారాయణ, గుగులోత్ రాంబాబు, మైనార్టీ మండల నాయకులు ఎస్.కె మైబు, మాడుగుల నాగరాజు, బోడ బాబూలాల్, మాలోత్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: