CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సెప్టెంబర్ 1నుండి పాఠశాలలు ప్రారంభం

Share it:

 



సమాయత్తమవుతున్న పినపాక మండల అధికారులు


వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన వివిధ శాఖల అధికారులు


మన్యం మనుగడ, పినపాక: 



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని అధికార యంత్రాంగం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం రోజున వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అన్ని విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకరరావు సంయుక్తంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా పినపాక ఎంపిడిఓ కార్యాలయంలోని సమావేశ మందిరంనందు పినపాక మండలానికి చెందిన అన్ని విద్యా సంస్థలకు చెందిన యజమానులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, వివిధ పంచాయతీల సర్పంచులు, సెక్రటరీలు పాల్గొని సెప్టెంబర్ 1 నుండి అన్ని రకాల పాఠశాలలు ప్రారంభం అవుతున్న సందర్భంలో, తదుపరి కార్యాచరణ గురించి, కోవిడ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమావేశంలో చర్చించడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల పై భాగంలో చెత్త పేరుకుపోయి వర్షాకాలం కారణంగా నీరు క్రిందికి దిగే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పై అధికారులు సమావేశంలో లో లో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ , ఎం పీ ఓ జే ఎల్ జీ గాంధీ,పీఆర్ ఏ ఈ వెంకట్ , ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: