CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ నెల 16న జమ్మికుంట పట్టణ శివారులోని శాలపల్లిలోదళితబంధు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Share it:

 


మన్యం వెబ్ డెస్క్:

మహత్తరమైన దళితబంధు పథకాన్ని ప్రారంభించే సందర్భంగా ఈ నెల 16న జమ్మికుంట పట్టణ శివారులోని శాలపల్లిలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాల్సిందిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను కోరారు. 


ఈ చారిత్రాత్మకమైన సభకు లక్షా 20 వేల మంది హాజరవుతారని, ఇందులో ఎక్కువ సంఖ్యలో దళితులే ఉంటారన్నారు. సభ జరిగే మైదానాన్ని మంత్రులు శ్రీ కొప్పుల ఈశ్వర్, శ్రీ హరీష్ రావు, శ్రీ గంగుల కమలాకర్ లు పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష చేశారు. సభను విజయవంతం చేసేందుకు గాను చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవలసిన జాగ్రత్తలు, అవసరమైన చర్యల గురించి జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు. 


ఈ సందర్భంగా మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ,దేశ చరిత్రలోనే గొప్ప పథకాన్ని ప్రారంభించేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఘన స్వాగతం చెప్పేందుకు, సభను దిగ్విజయం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.సభకు 825బస్సుల్లో దళితులు తరలివస్తారు.. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, సభ దిగ్విజయం అయ్యేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Share it:

Post A Comment: