CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంట్లో ఒంటరిగా 15 నేళ్ల బాలిక.. ఇంట్లో పురుగులు వస్తున్నాయి అంటూ లైట్లు ఆర్పేయమన్న ఎంపీటీసీ.. వైరా మైనర్ బాలికపై అఘాయిత్యం.

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఖమ్మం జిల్లాలోని వైరాలో మండలంలోని లింగన్నపాలెంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడక ఎంపీటీసీ బూర్గు సంజీవరావు లింగన్నపాలెంలోని తమ బంధువులు ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి వచ్చేవాడు.


ఓ రోజు అతడు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అక్కడ 15 ఏళ్ల బాలిక మాత్రమే ఉంది. ఇంటి దగ్గర ఎవరూ లేరన ఆమె చెప్పినా అతడు అక్కడ నుంచి వెళ్లలేదు. తెలిసినవాడే కాదా అని ఆమె కూడా ఏమి అనలేదు. ఇంట్లోకి వెళ్లిన అతడు పరుగులు ఎక్కువగా వస్తున్నాయని.. లైట్ బంద్ చేయమని ఆ బాలికను కోరాడు. దీంతో ఆమె లైట్ ఆర్పివేయగానే చేయితో తడుముతూ అసభ్యంగా ప్రవర్తించాడు. బలవంతంగా ఆ బాలిక ను దగ్గరకు లాగుతూ ఉండగా ఆమె భయపడి కేకులు వేసింది. దీంతో భయపడి పోయి సంజీవరావు ఆ ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఆగస్టు 5 న చోటుచేసుకుంది.


అదే రోజు ఈ విషయాన్నిబాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామ సర్పంచ్ కు వివరించగా, మందలిం చేందుకు పలుమార్లు పిలిచినా సంజీవరావు రాలేదు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైరా పోలీస్ స్టేషన్లో శనివారం బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Share it:

TELANGANA

Post A Comment: