CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్ని నియోజకవర్గాలలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు దళిత బంధు ఇవ్వాలి

Share it:

 


తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో ని 21 వేల దళిత కుటుంబాలకు అందరికీ దళిత బంధు 10 లక్షల రూపాయలు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే రైతు బంధు ఏ విధంగా అయితే ఓకే సారి రైతుల ఖాతాల్లో జమ చేశారో అదేవిధంగా దళిత బంధువు పథకం ద్వారా పది లక్షలు ఒకేసారి ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివ కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం లోని మాదారం గ్రామంలో మంగళవారం తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జంగు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివకుమార్ హాజరై మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలు,డంపింగ్ యార్డ్,స్మశాన వాటికలు పేరుతో దళితుల వేల ఎకరాల భూమి నీ తీసుకోవడం జరిగిందన్నారు.దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని మోసం చేశారని మరల హుజురాబాద్ ఎన్నికల పేరుతో దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.దళితుల మీద నిజంగా కెసిఆర్ కు ప్రేమ ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ ముందే రాష్ట్ర వ్యాప్తంగా గా ప్రతి దళిత కుటుంబం ఖాతాలో 10 లక్షలు జమ చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీన దళిత మహిళను దుర్మార్గంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దళితులపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఒకదాని తర్వాత ఒకటి సంఘటన మర్చిపోకముందే దాడులు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓయూ జేఏసీ కన్వీనర్ పై దాడి హేయమైన చర్య.ఓయూ జేఏసీ కన్వీనర్ పాల్వాయి నాగేష్ పై సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళుతున్న ఓయూ జేఏసీ కన్వీనర్ పాల్వాయి నాగేష్ పై పలువురు దాడికి పాల్పడడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న నాయకులపై దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు.దాడిలో పాల్వాయి నాగేష్ కు గాయాలు తోపాటు కారు ధ్వంసం అయిందని ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం అప్రజాస్వామికమని శాంతిగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులకు తెగబడటం పై మండిపడ్డారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు నాయకులు దాసరి కృష్ణ,పంతగాని సూర్యనారాయణ,మంచినీళ్ల వెంకటయ్య,పంథా గాని రాజమౌళి,సకినాల మల్లేషు, సకినాల కృష్ణస్వామి సమ్మయ్య,ముల్కల అనిల్, సకినాల లచ్చి మల్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: