CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అరుణోదయ పుట్టిన మొదటి రోజుల్లో మొదటి కార్యకర్త సయ్యద్ ఖాదర్ బాబా మృతి

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:

చండ్రుగొండ మండలం  తిప్పనపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్ బాబా (67)  ఆకస్మిక మరణానికి చింతిస్తున్నామని  అరుణోదయ మొదటి తరం నాయకులు బోగ గిరి అన్నారు. మంగళవారం  ఖాదర్ బాబా మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరుణోదయ సంస్థలొ ఖాదర్ బాబా చురుగ్గా పని చేశారని .అరుణోదయ పుట్టిన మొదటి రోజుల్లో మొదటి తరం కార్యకర్త  పాటలు పాడటంలో అరుణోదయ నాగన్న బుర్రకథకు బుర్రకథ వంత చెప్పుట ఖాదర్ ప్రత్యేకత అని అలాగే పిట్టలదొర చెప్పటంలో అయన దిట్ట అని అందుకే పిట్టలదొర ఖాదర్ గా పేరు పొందాడు. పార్టీకి సంస్థకు దూరమైనా పాత మిత్రులతో ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. న్యూ డెమోక్రసీ కార్యకర్తగా అరుణోదయ కార్యకర్తగా అయన సేవలు ప్రశంసనీయని అన్నారు. నేటి తరం నాయకులు ఇలాంటి కార్యకర్తలను పట్టించుకోక పోవడం బాధాకరమైన విషయం అన్నారు. ఖాదర్ బాబాకు సంతాపం తెలిపిన వారిలో రాష్ట్ర నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్లు. చుంచుపల్లి ఉపసర్పంచ్ లగడపాటి రమేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ బోజ్యా నాయక్, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, గానుగపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్ రావు, ఎంపీటీసీలు దారా బాబు, లంక విజయలక్ష్మి, టిడిపి మండల అధ్యక్షులు వారధి సత్యనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహ్మద్ సాబీర్ హుస్సేన్, జిల్లా సీనియర్ రిపోర్టర్ వాహిద్, ప్రతిభ విద్యాసంస్థల చైర్మన్ ఖాజా హుస్సేన్, వివిధ సంఘాల నాయకులు పార్టీల నాయకులు నివాళులర్పించారు..

Share it:

TELANGANA

Post A Comment: