CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల లో సి హెచ్ సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి ఏర్పాటుచేయాలి,సీపీఎం

Share it:

 


 మన్యం టీవీ చర్ల:

చర్ల మండల కేంద్రంలో సి హెచ్ సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రసూతి ఆసుపత్రి కి సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని పోస్టుమార్టం నిర్వహణ చర్ల మండల కేంద్రంలోని జరపాలని సిపిఎం గాంధీ సెంటర్ శాఖ, కెవిపిఎస్ మండల కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో  దీక్షకు దిగడం జరిగింది. ఈ దీక్ష రథసారథులు గా కెవిపిఎస్ మండల కార్యదర్శి మత్త రామారావు వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు శ్యామల వెంకట్ గాంధీ సెంటర్ సిపిఎం శాఖ నాయకుడు బందెల చంటి గాంధీ సెంటర్ సిపిఎం శాఖ నాయకురాలు షారోని హుస్సేన్ లు దీక్షల్లో కూర్చోవడం జరిగింది. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడుతూ గతంలో చర్ల మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆసుపత్రిని అధికారుల ప్రోద్బలం తోటి కొయ్యూరు ప్రాంతానికి తరలించడం జరిగింది చర్ల లో ప్రాథమిక ఆసుపత్రి స్థానంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని కడతామని చెప్పిన అధికారులు ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం సరి కాదని అన్నాడు ప్రాథమిక ఆసుపత్రి ఇక్కడి నుంచి తరలించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య సౌకర్యానికి ప్రజలు నోచుకోలేదని అన్నారు. 13 పంచాయతీలు 61గ్రామాలు 25604 మంది ప్రజలు చర్ల మండల కేంద్రంలో ఆసుపత్రి లేక ప్రభుత్వ వైద్యానికి దూరమవుతున్నారు. వీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బిసి ఎం బిసి మైనారిటీ పేద ప్రజలని వారికి హక్కుగా అందవలసిన ప్రభుత్వ వైద్యాన్ని వారికి దూరం చేయడం దుర్మార్గమని అన్నారు. చర్ల మండలంలో ప్రభుత్వ వైద్య సంక్షోభాన్ని నెలకొల్పారని దీనిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇటీవల కాలంలోనే ఇక్కడ ఆసుపత్రి లేని కారణంగా అనేకమంది మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇంత మంది ప్రజలు ఉన్న ఈ చర్ల మండల కేంద్రానికి ఆసుపత్రిని కేటాయించి వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అని అన్నారు. నేటికీ కూడా ఈ 25 వేల మంది ప్రజలను పట్టించుకోకపోవడం సిగ్గుమాలిన పని అని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఒక్క డాక్టరు కూడా ఒక్కరు కూడా లేరని, అన్నారు. డాక్టర్లు లేకుండా వైద్యం ఏ విధంగా చేస్తారు అని ప్రశ్నించారు అనేక మంది గర్భిణీ స్త్రీలు ఇక్కడ డాక్టర్లు నర్సులు లేనందున ఆస్పత్రికి వచ్చి వెనుతిరిగి పోతున్న పరిస్థితి చర్ల మండల కేంద్రంలో ఉందని అన్నారు. చర్ల మండల కేంద్రంలోని గతంలో మాదిరిగా పోస్టుమార్టం నిర్వాహణ జరిపించాలని. ఎవరైనా అనుమానాస్పదంగా మరణించినప్పుడు పోస్టుమార్టం నిర్వహించాలంటే యాభై మూడు కిలోమీటర్లు ఆ మృతదేహాన్ని తీసుకొని  ప్రయాణం చేసి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుంది దీని కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులు మరియు పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతుందని అన్నారు అందుకని తక్షణం చర్ల మండల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల ను దృష్టిలో పెట్టుకొని తక్షణం చర్ల మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని నిర్వహించి సంబంధిత వైద్యం ప్రజలకు అందించాలని తక్షణం ప్రసూతి వైద్యశాలకు సరిపడా వైద్య అధికారిని నియమించాలని 13 పంచాయతీల అరవై గ్రామాల ప్రజలకు చర్ల మండల కేంద్రంలో వైద్యం అందించాలని పోస్టుమార్టం నిర్వహణ చర్ల మండల కేంద్రంలోని నిర్వహించాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేయడం జరిగింది లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఈ నేత రిలే నిరాహార దీక్షలు ని ఆమరణ నిరాహార దీక్షలు గా కొనసాగిస్తామని హెచ్చరించారు.

 అనంతరం దీక్ష రథసారథులు సమస్య-పరిష్కారం అయ్యేంతవరకు ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ దీక్షల న్యాయమైన పోరాటన్ని  విద్యార్థులు యువకులు ఉపాధ్యాయులు మేధావులు ప్రజా సంఘాలు సోదర మిత్ర  రాజకీయ పార్టీలు అందరూ కలిసి చేయూతను అందించి జయప్రదం చేసి విజయవంతం  చేయాలని కోరారు. 

 ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బొల్లా వినోదం అలవాల రాజమ్మ కోటి ముత్యాలరావు చింతూరు రజనీకాంత్ వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షురాలు పొడుపు గంటి సమ్మక్క సిఐటియు ఆటో యూనియన్ నాయకులు పామర్ బాలాజీ  కెవిపిఎస్ నాయకులు పిల్లి రమేష్ ఫార్ముల సాంబశివరావు వరలక్ష్మి పాల్గొన్నారు.

Share it:

Post A Comment: