CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బ్లాక్ ఫంగస్ బారినపడిన కుటుంబాన్ని ఆదుకున్న సాబీర్ పాషా

Share it:

 


 గుండాల ఆళ్ల పల్లి  జూలై 22 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని తునికి బండ్ల గ్రామానికి చెందిన ఈసం దూలయ్య  గత కొద్ది రోజులుగా బ్లాక్ ఫంగస్ వ్యాధితో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు.  సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా  పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని  ఈసం దూలయ్య  కుటుంబ సభ్యులకు  అందజేశారు. దానితోపాటు  హైదరాబాదులో   ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట రెడ్డి కి  చరవాణిలో సమాచారం అందించడంతో   స్పందించిన రాష్ట్ర కార్యదర్శి ఆయనకు మెరుగైన వైద్యం అందే విధంగా తన వంతు సహాయం అందిస్తారని  చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో  వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య ,  ఆళ్ల పల్లి మాజీ సర్పంచ్ కృష్ణయ్య , నాయకులు మధ్యల వెంకటేశ్వర్లు , తదితరులు  పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: