CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ..

Share it:

 



👉 ప్రవక్తల త్యాగనిరతికి చిహ్నంగా కుర్బానీలు..


మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలో బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా మసీదు వద్ద సందడి నెలకొంది.బక్రీద్ పండుగ శుభ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక నమాజ్ జరిపారు. మౌళ్వీ (గురువు) షేక్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ముస్లింలు సామూహికంగా నమాజ్ చదివారు.ఆరిఫ్ పండుగ యొక్క ప్రాముఖ్యతను సోదరులకు వివరించారు.ఇబ్రహీమ్ (ప్రవక్త )యొక్క త్యాగనిరతికి చిహ్నంగా ఈద్ ఉల్ అజ్హా (బక్రీద్ )ను జరుపుకుంటారని,దీనిలో భాగంగా కుర్బానీగా ఒంటె, పొట్టేలు, మేక ,లాంటి జంతువుల మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి పంచుతారని,ఒక భాగం బీదలకు,రెండవ భాగం బంధువులకు,మూడవ భాగం తనకోసం, ఉంచుకోవడం జరుగుతుందని,వివరించారు.బక్రీద్ పండుగను పురస్కరించుకొని పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ కమిటీ అధ్యక్షులు షేక్ సిద్దిఖ్,ఉపాధ్యక్షులు జానిమియ్యా(టైలర్ )సెక్రటరీ అయూబ్, కమిటీ సభ్యులు బాబు,నాగుల్ మీరా,సోదరులు బుడేన్,ఖాసీం,మన్సూర్, పెద్ద నాగుల్ మీరా,లతీఫ్,నాగుల్ మీరా( కిరాణా), రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: