CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమ్మ జన్మనిస్తుంది రక్త ధాత పునర్జన్మనిస్తాడు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

ములుగు జిల్లా 

మంగపేట మండలంలోని జ్వాలా యూత్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విజవంతంగా నిర్వహించిన రక్తదాన శిబిరం.


నిర్జీమవుతున్న మనిషి జీవాన్ని,

జీవితాన్ని ఇచ్చే గొప్ప దానం రక్తదానం,

రక్తదానం చేద్దాం! మానవత్వాన్ని చాటుదాం! రక్తదానం చేద్దాం  ప్రాణదాతలౌదాం అని జ్వాలా యూత్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిచిన రక్తదాన శిబిరం విజవంతం అయింది, ఏటూరు నాగారం ప్రభుత్వ హాస్పటల్ బ్లేడ్ బ్యాంక్ వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిచారు, జ్వాలా యూత్ అధ్యక్షుడు కోడెల నరేష్ మాట్లాడుతూ ఏజెన్సి ప్రాంతంలో రక్తం అందక ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని మావంతుగా ఈ కార్యక్రమం చేపట్టాము అని తెలిపారు. ఈకార్యక్రమంలో అనేక మంది దాతలు ఉత్సాహంగా పాల్గొన్నారు

రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏ ఎస్ పి గౌస్ఆలం, మంగపేట తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్,   మంగపేట ఎస్ ఐ రాజేష్ ,ఏటూరు నాగారం సూపరింటెండెంట్ సురేష్  మంగపేట ప్రభుత్వ హాస్పటల్ డా :నాగేష్ నాయక్,రక్తం దానం చేసిన వారికి పండ్లు, రక్తదాన సర్టిఫికెట్లు,అందచేశారు. ఏ ఎస్పీ గౌస్ అలాం కూడా బ్లెడ్ డోనేషన్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్  మాట్లాడుతూ జ్వాలా యూత్ వారు మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కరోనా సమయంలో మండలం లో అనేక గ్రామాలలో కరోనా బాధితులకు నిత్యావసర వస్తువులు అందించారు అని ప్రశంసిచారు. మీరు ఇలా ఇంకా మునుముందు అనేక కార్యక్రమాలు జ్వాలా యూత్ చారిటబుల్ ద్వారా చేయాలి అని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఎండీ షకీల్,ఏటూరు నాగారం బ్లేడ్ బ్యాంక్ ఇంచార్జీ మురళి, డా"ఎన్ స్వాతి,హాస్పటల్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్  క్రాంతి, జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ బృందం, మంగపేట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: