CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులకే కేటాయించాం...

Share it:

 



👉 ఇండ్లలో నివాసముంటున్న వారందరూ గ్రామ సభ ద్వారా అధికారులు ఎంపిక చేసి లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించిన లబ్ధిదారులే...


👉 అక్రమం అనేది తప్పు అంతా సక్రమమే సర్పంచ్ కట్రం మోహన్ రావు...



మన్యం టీవీ : జూలూరుపాడు,

జులై 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్రం మోహన్ రావు మాట్లాడుతూ.. ఇల్లు లేని పేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రవేశ పెట్టింది అని అన్నారు. దీనిలో భాగంగా గ్రామంలో 80 ఇళ్లను నిర్మించారని తెలిపారు. అట్టి ఇండ్లను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సంబంధిత అధికారులు గ్రామ సభ ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయించారని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, రాష్ట్ర మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, ప్రారంభోత్సవం చేసి గృహప్రవేశాలు చేయించారని అన్నారు. గ్రామంలో ఇంకా చాలామంది అర్హులైన పేద వారు ఉన్నారని వారికి కూడా ఇల్లు మంజూరి చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకు పోయామని రానున్న రోజుల్లో వారికి కూడా ఇల్లు ఇప్పిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కొంతమంది రాజకీయ లబ్ధి కోసం, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, అసత్య ప్రచారాలు చేస్తూ.. డబుల్ బెడ్ రూం ఇళ్ల లో అక్రమంగా ప్రవేశించి అనర్హులు ఉంటున్నారంటూ ప్రజలను, అధికారులను, తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని, అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: