CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

Share it:


 


హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు


కరోనా  కాలంలో  చేసిన సేవలకు పినపాక మండల వైద్యశాఖకు అభినందనల వెల్లువ


ఆర్టీసీ సేవలు మారుమూల గ్రామాలను కలుపుతూ ఉండాలి


సర్పంచులకు సేవలో చిత్తశుద్ధి లేదు-సర్పంచుల గైర్హాజరు పట్ల చర్యలు తీసుకుంటాం.


అటవీ శాఖ గ్రామ పంచాయతీలలో గ్రావెల్ కు సహకరించాలి


నీటి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు సర్వసభ్య సమావేశం మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన పిమ్మట పలు శాఖలకు సంబంధించిన అధికారులు వారివారి ప్రగతి నివేదికలను చదివి వినిపించడం జరిగింది. రాబోయే కాలంలో చేయబోయే కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. అనంతరం ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి గైర్హాజరైన సర్పంచుల తీరుపట్ల ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ, సమస్యలపై సర్వసభ్య సమావేశంలో లో ప్రశ్నించడానికి రాని, సర్పంచుల పనితీరు బాగాలేదని, వారి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం పినపాక మండల వైద్యశాఖ కరోనా కాలంలో చేసిన సేవలకు సంతోషపడి, అభినందనల వెల్లువ కురిపించారు. అదేవిధంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలను  చేసిన సేవల పట్ల పొగడ్తల వర్షం కురిపించారు.అటవీశాఖ అధికారులు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం గ్రావెల్ రోడ్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతూ మణుగూరు డిపో నుండి అనంతారం వెళ్లే బస్సులు చిన్న చిన్న గ్రామాలను సైతం కలుపుతూ వెళితే ఆర్టీసీకి ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఆ విధంగా ఆర్టీసీవారు పనిచేయాలని సూచించారు. నీటిపారుదల విషయానికి సంబంధించి మాట్లాడుతూ, పినపాక మండలం లోని లొటారిగండి ప్రాజెక్టు గురించి, గట్టు చెరువు, గడ్డంపల్లి దగ్గరలో రిజర్వాయరు గురించి మాట్లాడారు. సీతమ్మ బ్యారేజ్ నీటి కారణంగా రాబోయే రోజులలో మండలానికి పుష్కలంగా నీరు అందుతుందని తెలియజేశారు. సర్పంచులు మీమీ గ్రామాల్లో గల విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. విద్యుత్ శాఖ వారు ఎస్సీ ఎస్టీలకు అందేపథకాల గురించి పూర్తిగా వివరించాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, తహసిల్దార్ వెంకట విక్రమ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, వివిధ శాఖలకు చెందిన అధికారులు, పంచాయితీ సర్పంచులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: