CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన బి సి ఆర్ ట్రస్ట్

Share it:

 


మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:

ఊరు పెద్దది.... మనసు చిన్నది

ఆపద వస్తే ఆదుకోవాల్సిన ఊరు

 కష్టం వస్తే కాపాడాల్సిన బంధువులు

 అందరూ దూరం పెట్టారు

కరోనాతో మృతిచెందిన మృతదేహం అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు*..

*ఆ కుటుంబానికి అండగా నిలిచింది బండారు చందర్రావు (బి.సి.ఆర్) ట్రస్ట్*....

*ఊరు రాకున్నా బంధువర్గం లేకున్నా అన్నీ తామై అర్ధరాత్రి 12 గంటలకు అంత్యక్రియలు నిర్వహించిన బి సి ఆర్ ట్రస్టు నిర్వాహకులు*

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి వెయ్యి పైచిలుకు కుటుంబాలు ఉన్న అతిపెద్ద ఊరు.... ఆ గ్రామంలో

లో సాయిలు సత్యనారాయణ (బాబు) కొడుకు సాయిలి వినయ్ కుమార్ వయస్సు 42 సంవత్సరములు గత నెల రోజులుగా కరోనాతో పోరాడుతూ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని తమ స్వగ్రామమైన తోటపల్లి గ్రామానికి తీసుకురాగా గ్రామంలోని ప్రజలు గాని.. బంధువులు గాని...ఎవరు అంత్యక్రియలు నిర్వహించడానికి దగ్గరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బీసీల ట్రస్టును ఆశ్రయించారు. అంత్యక్రియలు నిర్వహించడానికి రావాలని ప్రాధేయపడ్డారు. దాంతో ట్రస్టు నిర్వాహకులు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొలగాని బ్రహ్మచారి లు అర్ధరాత్రి బయలుదేరి భద్రాచలం నుండి తోటపల్లి చేరుకొని అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. సాయిలు వినయ్ కుమార్ కు ఇద్దరు పిల్లలు,భార్య ఉన్నారు.

*బి సి ఆర్ ట్రస్టు రుణం తీర్చుకోలేము*... ఊరు కాదన్నా ...బంధువులు లేకున్నా అన్నీ తామై నా కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన బి సి ఆర్ ట్రస్ట్ కు రుణపడి ఉంటామని వినయ్ కుమార్ తండ్రి సత్యనారాయణ, మేనమామ కడియాల శేషగిరి లు అన్నారు.. బిసి ట్రస్ట్ నిర్వాహకులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: