CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నదాతల సేవకు పునరంకితం కావాలి.......

Share it:

  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి.


 ఘనంగా స్పైసెస్ బోర్డు డిడి లింగప్ప జన్మదిన వేడుకలు...


మన్యం టీవీ మంగపేట 

వ్యవసాయ రంగంలో అన్నదాతల సేవలకు పునరంకితం కావాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. శుక్రవారం స్పైసెస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాది లింగప్ప జన్మదిన వేడుకల  కార్యక్రమానికి సాంబ శివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాలుగా డాక్టర్ లింగప్ప గారి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వివేక యఫ్.పి.ఓ ప్రాంగణంలో మొక్కలు నాటి చెట్లుగా అభివృద్ధి చేశామని అన్నారు. అదేవిధంగా మూడు దశాబ్దాలుగా సుగంధ రైతులకు లింగప్ప అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. త్వరలోనే డిప్యూటీ డైరెక్టర్ స్థాయి నుండి డైరెక్టర్ స్థాయికి లింగప్ప కి పదోన్నతి కలగాలని రైతు పక్షాన తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం లింగప్ప జన్మదినం సందర్భంగా సాంబశివ రెడ్డి ఆయనకు పూల బొకే అందించి, మిఠాయిలు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లింగప్ప మాట్లాడుతూ  రైతుల ఆశీస్సులు ఉన్నంతకాలం తాను రైతు సేవకే పునరంకితం అవుతారని తెలిపారు. ఆగస్టు ఒకటి నుండి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరగనున్న ""సుగంధ మహోత్సవం "" కార్యక్రమంలో లో  రైతులు స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటి  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికాస్ ఆగ్రీ ఫౌండేషన్ డైరెక్టర్ నేలపట్ల శేషారెడ్డి సతీష్, స్పైసెస్ బోర్డు సిబ్బంది సాగర్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: