CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం పై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు

Share it:

 


*మన్యం టీవీ ఏటూరు నాగారం

యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో ములుగులోని రుద్రేశ్వరాలయం( రామప్ప దేవాలయము) ఎంపిక కావడం పట్ల ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కాంగ్రేస్ పార్టీ కమిటీ  నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.(జులై 25)ఈరోజు ఎంతో చారిత్రకమైందని తెలంగాణకుమర్చిపోలేనిదన్నారు.ఆనాటి కాంగ్రేస్ హయాంలో కాకతీయ శిల్ప కలను ప్రపంచానికి తెలియ పరచడం కోసం కాంగ్రేస్ పార్టీ కృషి చేసింది అని అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రామప్ప రుద్రేశ్వర ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు రావడం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రొఫెసర్లు పాండు రంగా రావు, పాపా రావు శ్రీనివాస చార్యులకు  ఏళ్ల నిరీక్షణకు యునెస్కో శుభ ముగింపు పలికింది అని యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన భారత ప్రభుత్వానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించిన 21 దేశాల ప్రతినిధుల కు సహకరించిన  ములుగు ఎమ్మెల్యే సీతక్కకి ములుగు జిల్లా అధికార యంత్రాంగానికి మరియు యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో ములుగులోని రుద్రేశ్వరాలయం( రామప్ప దేవాలయము) ఎంపిక కావడం కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి పేరు పేరున  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ ,కాంగ్రేస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్, పిఎసిఎస్ చైర్మన్ పన్నల ఎల్లారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు కణతల బుజ్జి నాగేందర్ రావు,పాలడుగు వెంకట కృష్ణ,జంపాల చంద్ర శేఖర్,జెట్టి సోమయ్య,సూది రెడ్డి,జనార్ధన్ రెడ్డి,ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు,పస్రా ఉపసర్పంచ్ బద్దం లింగా రెడ్డి, యూత్ నాయకుడు పెండం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: