CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పిల్లల కోసం మళ్ళీ విద్యా బాటను పట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

Share it:


👉కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ మీకు ఎల్లప్పుడూ  అండగా ఉంటుంది


మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 29 :- కొత్తగూడెం పురపాలక సంఘంములోని మేదర బస్తి (కిరోసిన్ బంక్) రైల్వే స్టేషన్ పక్కన గల గృహసముదాయాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తొలగించినటువంటి వారి కొరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలమేరకు పాత కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్ నందు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ వారికి అన్ని వసతులు కల్పించడం జరిగినది. 

కొత్తగూడెం మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ,  మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, కొత్తగూడెం తాసిల్దార్ పీ వీ. రామకృష్ణ, పర్యవేక్షణలో వారికి ఉదయము టిఫిన్స్ దగ్గర ఉండి వడ్డించడం జరిగినది,దీని అనంతరం మెడికల్ డిపార్టుమెంట్ వారితో మాట్లాడి అట్టి పాఠశాల నందు ఉన్నవారందరికి ఎప్పటి కప్పుడు హెల్త్ చెకప్ చేయించి వారికి అవసరమగు మందులను ఇప్పించడం జరిగినది. 

అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రుల వినతి మేరకు చైర్ పర్సన్ తెలంగాణ స్కూల్ హెడ్ మాస్టర్ తో మాట్లాడి సదరు కేంద్రంలో కరోనా నిబంధనలతో పిల్లల తరగతులు నిర్వహించవలసినదిగా కోరి,  కాపు సీతాలక్ష్మి చైర్ పర్సన్ అట్టి పిల్లలకు పలక, బలపములు, నోట్ పుస్తకములు, పెన్సిల్లు, మొదలగు వాటిని పిల్లలకు అందించి విధ్యాభోదన దగ్గరుండి బోధించడం జరగినది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు మున్సిపల్ చైర్ పర్సన్ - మున్సిపల్ కమిషనర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా పున:రావాస కేంద్రంలో అన్ని వసుతులు కల్పించుతూ పారిశుధ్యం, టాయిలెట్స్, పరిసరాలను పరిశుబ్రంగా ఉంచవలసినదిగా ఇంచార్జ్ శానిటరీ ఇన్స్ స్పెక్టర్ మరియు శానిటరీ జవాన్లకు అదేశించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో కాపు సీతాలక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ పరమేష్ యాదవ్ పున:రావస కేంద్రంలో ఉన్న కుటుంబాలతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మీకు ఎల్లవేళలా అండగా ఉంటారని మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదని ఇట్టి విషయం గురించి గౌరవం ముఖ్యమంత్రి తో చర్చిస్తారని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బరోసాను కల్పించడం జరిగినిది.  

ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి తో పాటు వైస్ చైర్మన్ దామోదర్,కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు యాకూబ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ఎమ్మార్వో రామకృష్ణ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వీరభద్రా చారి, శానిటేషన్ జవాన్లు, పాత కొత్తగూడెం యు పి హెచ్ ఎస్ పొన్నెకంటి సంజీవ రావు, డాక్టర్ నిస్సి, డాక్టర్ పాషా, మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మరియు మున్సిపల్ పరిధిలోని ప్రజలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: