CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాణ్యతలేని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం

Share it:


ప్రజా సంఘాలఆధ్వర్యంలగంపల్లి డబల్ బెడ్ రూమ్ సందర్శన


మన్యం టీవీ మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండలంలోని సంగంపల్లి గ్రామంలో ప్రభుత్వo నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ లను శుక్రవారం ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ ప్రజా విద్యార్థి సంఘాల జిల్లా ప్రతినిధులు సందర్శించిభవనాలనాణ్యతనుపరిశీలించారు.నాణ్యత లేని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పట్ల వారు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు.కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం టీఏజీఎస్ నాయకులు కొమరం సందీప్ కుమార్ మాట్లాడుతూ  డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభించి ఐదు సంవత్సరాలు అయినా ఇప్పటివరకూ సరిగ్గా పూర్తి కాలేదని  నాణ్యతలేని కట్టుబడులు కడుతున్నారన్నారు. నామమాత్రపు నిర్మాణ కట్టుబడుల ద్వార లబ్ధిదారులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని,

అదేవిధంగా ప్రభుత్వ అధికారులు స్పందించి,ఇళ్ల నిర్మాణం లో జరిగే అన్యాయాల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్ యాజమాన్యం కుమ్మక్కై గ్రామ ప్రజలకు నష్టం కలిగే పనులు చేస్తున్నారని వారు వాపోయారు. పనులు ప్రారంభించినప్పటినుండి ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టు యాజమాన్యం ఇప్పటి వరకు పర్యవేక్షణ చేయలేదన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ కాంట్రాక్టర్ ను తొలగించి అతని పై చర్యలు తీసుకొని గ్రామ ప్రజలు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టి.ఎ.జి.ఎస్ నాయకులు 

 కొమరం సందీప్ కుమార్

ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి డివైఎఫ్ఐ నాయకులు

రమేష్ నరేష్ ప్రసాద్ గ్రామస్తులురమేష్ ,నరేష్, సతీష్ ,అంజి,సమ్మయ్య ,పుల్లయ్య ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: