CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట పేపర్ బోర్డుపై మరో కేసు నమోదు

Share it:

 


పోలీసులకు ఫిర్యాదు చేసిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు 

 పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని ఆకృత్యాలు వెలుగులోకి 


 మన్యంటీవీ, అశ్వారావుపేట:  అశ్వారావుపేట శ్రీ లక్ష్మీ తులసి ఆగ్రో పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పై మరో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. పేపర్ బోర్డులో రక్షణ చర్యలు లేమితో సోంకు మండవి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి పరిశీలించేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిధులకు, పోలీసువారికి, పేపర్ బోర్డ్ లో జరుగుతున్న అనేక ఆకృత్యాలు బయటపడ్డాయి. వారం రోజుల నుండి పేపర్ బోర్డుపై మీడియాలో అనేక కథనాలు ప్రచురితమైనప్పటికీ అధికారులు చాలా ఆలస్యంగానే స్పందించారని చెప్పవచ్చు. బాలకార్మిక చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన అధికార గణం వారం రోజుల తర్వాత ఎట్టకేలకు స్పందించింది. ఈ లోపు పేపర్ బోర్డ్ లో పనిచేస్తున్న అనేకమంది మైనర్ బాలురను ఫ్యాక్టరీ నుండి రహస్యంగా తరలించేసారనే వార్తలు వినిపిస్తున్నాయి. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ ఖలీల్ వారి బృందం ఆధ్వర్యంలో పేపర్ బోర్డులో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసువారికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పేపర్ బోర్డులో జరుగుతున్న అకృత్యాలపై  కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా పేపర్ బోర్డు వలన అనేక విధాలుగా నష్టపోతున్న ప్రజలు రైతాంగం కు న్యాయం జరిగేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: