CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం రమణక్కపేట పంచాయతీ బిల్డింగ్

Share it:

 



కట్టించిన కాంటాక్ట్ ర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి-విద్యార్థి సంఘాల డిమాండ్.

మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామపంచాయతీ భవనం కట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు అప్పుడే అప్పుడే శిదిలావస్థకు చేరుకోవడం ఇది కాంట్రాక్టర్, అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యంనకు నిదర్శనం అనిచెప్పవచ్చు. ఇట్లా కట్టిన బిల్డింగ్ అట్లా కూలిపోతుంటే ప్రభుత్వ అధికారులు ఏమిచేస్తున్నారు, చూసి చూడనట్లు ఉండి కాంట్రాక్టర్ ల కొమ్ము కాయడం ఏమిటీ అని విద్యార్థి సంఘాలు ఇటువంటి నిర్లక్ష్యం ప్రభుత్వసొమ్ము దోచుకొని నాణ్యత లేని భవనాలు కట్టి ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లచెయడం ఇటువంటి వాటిపై అధికారులు విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ ఎం పి ఓ 

శ్రీకాంత్ కు  వినతిపత్రం అందజేయడం జరిగింది.తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం( టీ ఏ జి ఎస్ )తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొమరం సందీప్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ ఎఫ్ ఐ) నాయకులు తోకల రవి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమణక్కపేట స్థానిక ప్రభుత్వ పంచాయతీ భవనం 2018-19 లో కట్టడం జరిగింది. 25,00,000/రూపాయలు ఖర్చు అయ్యింది.నాణ్యత లోపం వలన భవనానికి  మధ్యలో నెర్ర బాసింది  ఫర్నిచర్ లేకుండా నాణ్యతలేని కట్టుబడులు కడుతున్నారు నామమాత్రపు కట్టుబడుల ద్వార  నష్టం వాటిల్లుతుంది

అదేవిధంగా ప్రభుత్వ అధికారులు స్పందించి జరిగే అన్యాయాల పైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్  యాజమాన్యం కుమ్మక్కై గ్రామ ప్రజలకు నష్టం కలిగే పనులు చేస్తున్నారని వారు వాపోయారు. పనులు ప్రారంభించిన అప్పటినుండి యాజమాన్యం ఇప్పటి వరకు పర్యవేక్షణ చేయలేదు.ఈ నాసిరకం పనులతో కాసులకు కక్కుర్తి పడుతున్న అవినీతి కాంట్రాక్టర్ పై ఐటీడీఏ అధికారులు కూడా సమాచారం ఇవ్వడమైనది. ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ యొక్క కాంట్రాక్టర్ ను  యాజమాన్యం పై చర్యలు తీసుకొని , నాసిరకం నిర్మాణాలు చేపడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న కాంట్రాక్టర్ ని బ్లాక్లిస్టులో పెట్టి , ఇటువంటి పనులు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తూ గ్రామ ప్రజలు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల టీ ఏ జి ఎస్, ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో 

టీ ఏ జి ఎస్ నాయకులు కొమరం సందీప్ కుమార్,

ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు తోకల రవి రఘు ,మురళి , రామ్మోహన్

 తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: