CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైకుంఠధామం లో కనీస వసతులు కల్పించాలి

Share it:

 



 👉అకినేపల్లి మల్లారం గ్రామ ప్రజల డిమాండ్

 🔥గ్రామ సభ నుండి వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేసిన ప్రజలు.

✍️మైపా శంకర్, మన్యం మనుగడ ప్రతినిధి

మన్యం టీవీ మంగపేట.

మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో శనివారం  జరిగిన గ్రామ సభ నిరసనల మధ్య కొనసాగింది. అకినేపల్లి మల్లారం గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన వైకుంఠధామం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో  నిర్మించారని ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన దాతలు నాశిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి నాశిరెడ్డి సాంబశివ రెడ్డి  సంయుక్తంగా ముందుకు వచ్చి రూపాయలు 25 లక్షలు భూమిని విరాళంగా ఇచ్చారని అంతేకాకుండా వైకుంఠధామం ఏర్పాటు చేసిన స్థలానికి రహదారి సౌకర్యం తో పాటు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ వైకుంఠ దామంలో ఒక బోరు, ఒక మినీ షెడ్ నిర్మాణానికి గ్రామ పంచాయతీ నిధులు వెచ్చించాలని గ్రామస్తులంతా ముక్తకంఠంతో నినదించి కార్యదర్శి కోడేపాక శ్రవణ్ కుమార్ ను కోరారు. కార్యదర్శి  బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడంతో గ్రామ ప్రజలు కార్యదర్శి సమాధానాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభ నుండి వాకౌట్ చేసి  గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో  నిరసన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలతోటి గ్రామసభ లేకుండానే కొన్ని పనులను కార్యదర్శి ఏకపక్షంగా విడిసి లు చేస్తున్నారని. కానీ  గ్రామ ప్రజలంతా ఏకస్తులై గోదావరి నది తీరాన దాతలు నిర్మించిన వైకుంఠధామం లో కనీస మౌలిక సదుపాయాలు బోర్వెల్ ,మినీ షెడ్ ఏర్పాటుకు కోరుతుంటే అధికారులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు .ఈరోజు గ్రామ సభలో తీర్మానించిన విధంగా కచ్చితంగా పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.కార్యదర్శి శ్రావణ్ తన మొండి వైఖరిని మానుకోవాలని సూచించారు. చివరకు ఉన్నతాధికారుల అనుమతి తో గ్రామంలో దాతలు నిర్మించిన వైకుంఠధామం లో బోరు షెడ్డు నిర్మాణానికి తీర్మానించడం తో సభ సజావుగా సాగింది. వీలైనంత తొందరలో  వైకుంఠ ధామం లో పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కార్యదర్శిని ఎంపీవోనీ కోరారు. ఈ కార్యక్రమంలో  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజమల్ల. సుకుమార్, టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు రూప భద్రయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు షేక్ మొయినుద్దీన్, బిజెపి మండల ఉపాధ్యక్షుడు తొండపు శ్రీనివాసరెడ్డి ,పేసా కమిటి ప్రతినిధి డబ్బుల ముత్యాలరావు, టిఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు వైట్ల విశ్వనాథం ,ధూళిపాల బాలకృష్ణ ,బోడేపూడి రాఘవరావు, నాశిరెడ్డి నాగిరెడ్డి, కాంగ్రెస్ గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షుడు కటుకూరి శేషయ్య సుమారు 60 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: