CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను జంటనగరాలుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం - తుది శ్వాస వరకుా ప్రజా సేవే ఆశయం. - ఎం.ఎల్.ఏ వనమా.

Share it:

 



మన్యం టీవి పాల్వంచ :-

పాల్వంచ,కొత్తగూడెం పట్టణాలను జంటనగరాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని *కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు* అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా శనివారం *వనమా* పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కొమ్ముగూడెం (గొల్లగూడెం), నవభారత్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. హరితహారం  మొక్కలు నాటారు. గ్రామ సభలు నిర్వహించారు. ప్రజలు మహిళలు సమస్యలు  విన్నవించగా తక్షణమే పరిష్కారానికై అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా *వనమా* మాట్లాడుతూ తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ప్రజా సేవే ఆశయంగా పనిచేస్తానన్నారు. *ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు*  ఆశీస్సులతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై వారి కష్టాల్లో పాలుపంచుకుంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తన ఇంటి తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయన్నారు.


ఈ కార్యక్రమంలో *టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, రైతుబంధు సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరరావు, మచ్చా శ్రీనివాసరావు, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, డీఈ మురళి, తహసీల్దార్ స్వామి, ఎలక్ట్రికల్ ఏడీఈ ఏఈలు కన్నయ్య, రాజేష్ పబ్లిక్ హెల్త్ డి.ఈ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్  వాణీ కుమారి, టీఆర్ఎస్ నాయకులు మల్లెల శ్రీరామమూర్తి, యస్.వి.ఆర్కె ఆచార్యులు, కాల్వ ప్రకాష్ రావు,కాల్వ భాస్కర్, బేతంశెట్టి   విజయ్, దాసరి నాగేశ్వరరావు, బండి చిన్న వెంకటేశ్వర్లు, చింతా నాగరాజు, కాసుల వెంకట్, ఆనంద్, వీరన్న, అక్బర్, రాంబాబు, రాములునాయక్, సర్వయ్య, జొన్నాడ రమేష్,  నరేష్, ఏనుగుల శ్రీను, హబీబ్,  పుప్పాల సత్యం* తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: