CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసిన దుమ్ముగూడెం పొడు రైతులు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం గౌరవరం గ్రామానికి చెందిన ఆదివాసి రైతులు ఎన్నో సంవత్సరాల నుండి సుమారు 130 కుటుంబాలు పోడు భూమి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని,2008 లో ప్రభుత్వం తొమ్మిది మందికి పట్టాలు ఇచ్చింది అని,మిగతా వారికి పట్టాలు ఇవ్వలేదని తెలిపారు.ఈ భూమి పై 2007లో పది మంది పై కేసులు కూడా పెట్టారని,అప్పటి నుంచి సాగు చేసుకుంటున్న భూములను,2020 తొలకరి లో వేసిన పంటను అటవీశాఖ అధికారులు ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు అని తెలిపారు.రైతులు అడ్డుపడి నిరసన తెలుపగా సుమారు 75 మందిపై కేసులు పెట్టి జైలుకు పలు చేశారని,అందులో 62 మంది స్త్రీలు ఉన్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది అని తెలిపారు. దుమ్ముగూడెం తహశీల్దార్ మమ్మల్ని పిలిపించి,అటవీ అధికారులు వేసిన మొక్కలను నష్టపరిచాము అని,28 మందికి,28 లక్షలు రూపాయలు ఫైన్ మూడు రోజుల్లో కట్టాలి అని చెప్పారు అని,తినడానికి తిండి లేని,అడవి ప్రాంతంలో   ఉండి,కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ సాగిస్తు,దుర్భరంగా జీవనం కొనసాగిస్తున్న మమ్మల్ని తాసిల్దార్ గారు మూడు రోజుల్లో ఫైన్ కట్టాలి అని లేని ఎడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు వారి బాధను తెలిపారు.ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ అధికారులు తో మాట్లాడి న్యాయం చేయాలని,మాపై కేసులు ఎత్తివేయాలని, అటవీ అధికారులు ధ్వంసం చేసిన పంటలకు నష్ట పరిహారం ఇప్పించాలని కోరారు.పొడు భూములకు పట్టాలు ఇప్పించాలని, ఫారెస్ట్ అధికారుల నుండి ఆదివాసీల రక్షణ కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పందిస్తూ సంబంధిత అధికారుల తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తాము అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,టిఆర్ఎస్ నాయకులు,ఆదివాసి రైతులు కన్నయ్య,తాటి వీరమ్మ,రాధా,సీతా,లక్ష్మి దేవి,మంగమ్మ,భద్రయ్య,లక్ష్మి,దుర్గా,జానకమ్మ,జ్యోతి,సాయమ్మ,భద్రయ్య,దుర్గయ్య,గంగమ్మ,రాంబాబు, శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: