CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సేవలో సరిలేరేవ్వరు కందికి

Share it:

 


👉గాయపడి వైద్యం పొందుతూ నే... దాతృత్వం

👉మంచి మనసుకి వందనం అని అంటున్న ప్రజానీకం

👉అందరివాడు మా కంది సుబ్బారెడ్డి.

✍️దొడ్డి శ్రీనివాస్ ,మన్యం మనుగడ ప్రతినిధి

మన్యం మనుగడ, పినపాక: 

పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామస్తుడు, మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి కరోనా కాలంలో కరోనా వ్యాధి సోకిన రోగులకు నిత్యావసరాలను అందించి మండల ప్రజలకు ఆత్మీయుడు అయినాడు . కరోనా కారణంగా చనిపోయిన కుటుంబాల వివరాల గురించి తనంతట తానుగా తెలుసుకొని, వారి ఇంటికి తానే స్వయంగా వెళ్లి 50 కేజీల బియ్యాన్ని అందజేసిన సందర్భాలు ఎన్నో. మండలంలోని ప్రతి గ్రామంలో గల ఆర్థికంగా నిలదొక్కుకోలేని కుటుంబాలకు ఆపద్బాంధవుడుగా నిలిచాడు. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కంది సుబ్బారెడ్డి గాయాలపాలైనారు. తగిన చికిత్స కోసమని కుటుంబసభ్యులు హైదరాబాదు ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొన్ని రోజుల క్రితం పినపాక మండలం పోట్లపల్లి పంచాయితీ ఉలవ చెలక గ్రామానికి చెందిన పూనెం నరసింహారావు( 75), అనే వ్యక్తి కరోనా సోకి మరణించాడు అనే విషయాన్ని తెలుసుకున్న కంది సుబ్బారెడ్డి వెంటనే స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్పటికీ, ఆర్థికంగా లేనివారికి సహాయం చేయాలి అనే సత్సంకల్పంతో, నరసింహారావు కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని, మిత్రుల ద్వారా అందజేయడం జరిగింది. గాయం లోనూ సాయం చేసే గుణాన్ని మండల ప్రజలు వర్ణిస్తూ, ఇంత గొప్ప వ్యక్తి గాయాలపాలు కావడం బాధాకరమని, దైవానుగ్రహంతో

తొందరలోనే కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో గొంది నాగభూషణం, పూనెం వెంకటనర్సయ్య, పోలెబోయిన రవిందర్, పడిగ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: