CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డ్రైవర్లు వాహనాలను ఓవర్ టేక్ చేసి జీవితాలను నష్టపోవద్దు: ఇల్లందు సిఐ బరపటి రమేష్

Share it:

 



పన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు వాహనాలు నడిపి డ్రైవర్లు సాధ్యమైనంత ఓవర్ టెక్ చేయకుండా వాహనాలను నడపాలని ఇల్లందు సిఐ రమేష్ వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. విలేకరులతో మాట్లాడుతూ.. వాహనాలు ఓవర్ టేక్ చేసి తమ విలువైన జీవితాలను నష్టపోకూడదనే గమ్యం చేరడానికి కొద్ది సమయం మాత్రమే పడుతుందని అంతమాత్రాన తొందరపడి ప్రమాదాలకు గురై భార్య పిల్లలను ఇబ్బందికి గురి చేయవద్దని ఆయన అన్నారు. మితిమీరిన వేగం హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపటం సీటు బెల్టు, ముఖానికి మాస్క్ తదితర అంశాలను పరిశీలించి వాహనాలు నడపాలని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ముందు వెళ్లే వాహనాలను దాటి వెళ్లాలనే ఆత్రుతతో ఎదురుగా వచ్చే వాహనాలు గమనించలేక పోవడంతో ఈ మధ్యకాలంలో అనేక ప్రమాదాలు జరిగాయి ఇకముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. వాహనాలు నడిపే సమయంలో మద్యం సేవించడం, సిగరెట్, గుట్కాలను వాడటం కూడా నేరమేనని సిఐ అన్నారు. కాబట్టి జాగ్రత్త వాహనాలు నడిపి వారి వారి గమ్యస్థానాలకు చేరి భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని ఆయన కోరారు.

Share it:

Post A Comment: