మన్యం టీవీ, అశ్వరావుపేట: జోరున వర్షం కురుస్తున్నా వాళ్ల ముందున్న లక్ష్యాన్ని పూర్తి చేయటం వాళ్ల కర్తవ్యంగా భావిస్తారు పవన్ కళ్యాణ్ సేవ సమితి. అశ్వారావుపేట పట్టణంలోని శివయ్య వీధిలో నివాసముంటున్న సామినేని సత్యనారాయణ(52) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు, కరోనా లక్షణాలతో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ సేవా సమితి అధ్యక్షులు డేగల రామచంద్ర రావు కు దహన సంస్కారాలు చేయవలసిందిగా కోరారు, వెంటనే టీం సభ్యులతో కలిసి జోరువానలో సైతం లెక్కచేయకుండా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కురిశెట్టి నాగబాబు నాయుడు, మిండ హరిబాబు, నార్ల పాటి అశోక్, చిట్టితల్లి అంబులెన్స్ డ్రైవర్ బాజీ, సాయి పాల్గొన్నారు.
Post A Comment: