CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులను బెదిరింపులకు గురి చేస్తే సహించేది లేదు

Share it:

 


👉సీతమ్మ సాగర్ నిర్వసిత రైతులకు వామపక్ష ప్రతిపక్ష పార్టీల మద్దతూ

3వ రోజు నిర్వసిత రైతు ల సదస్సు

పాల్గొన్న కూనంనేని సంబాశివరావు , మీడియం బాబురావు పోతినేని సుదర్శన్ గుమ్మడి నర్సయ్య

మన్యం టీవీ, అశ్వాపురం :సీతమ్మ సాగర్ బు నిర్వశితులను బెదిరిస్తే ఊరుకోమ్ అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎల్ మరియు టి అధికారులను ప్రభుత్వ పెద్దలను హెచ్చరించారు. శనివారం ఉదయం మండలం లోని అమ్మగారిపల్లి గ్రామం లో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య అధ్యక్షతన జరిగిన భూనిర్వసిత రైతు సదస్సు లో అయన ప్రసంగిస్తూ రైతులను ఒప్పించి 2013కేంద్ర ప్రభుత్వ బు సేకరణ చట్టం ఆర్.ఆర్ ప్యాకేజీ చెల్లించి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం బలవంతంగా చెక్కులు కోర్టు లో డిపాజిట్ చేసి భూముల నుండి రైతులను వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తే ప్రతిగాటిస్తామని ఎంతటి పోరాటానికైనా సిద్దపడి పనులను అడ్డుకుంటామని తెలిపారు. సీతారామ సీతమ్మ సాగర్ ల నిర్మాణం లో సాగులోకి వచ్చే ఆయకట్టు కంటే నష్ట పోతున్న ఆయకట్టు ఎక్కువ గా ఈ నియోజకవర్గం లో ఉన్నదని నూతన ఆయకట్టు పెంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ప్రతి అంగుళం భూమికి నీటి వసతి కల్పించాలని అమ్మగారి పల్లి లో నిర్మించాబోయే హైదల్ ప్రాజెక్ట్ జల విద్యుత్ కేంద్రం లో నిర్వశితులకు స్థానిక నిరుద్యోగ యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ మీడియం బాబురావు సిపిఐ ఎంల్ న్యూ డెమోక్రాసి రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య, అవునూరి మధు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, న్యూ డెమోక్రాసి జిల్లా నాయకులు ఉమ్లా సతీష్, నిర్మల, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, కమటం వెంకటేశ్వరరావు, సిపిఎం డివిజన్ కార్యదర్శి కాటిబోయిన నాగేశ్వరావు, కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగ సీతారాములు చందా సంతోష్, టీడీపీ నియోజకవర్గం కార్యదర్శి వట్టం నారాయణ దొర తుల్లూరు ప్రకాష్ ,టీజెస్ నాయకులు పగడాల కరుణాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక నాయకులు వెర్పుల మల్లికార్జున్, గద్దల శ్రీను, కమటం సురేష్, దంతాల జగదీశ్, కొండపర్తి ప్రసాద్, శ్యామల మోహన్ రెడ్డి, నేలపట్ల కోటిరెడ్డి, సురకంటి ప్రభాకర్ రెడ్డి ,తాటిపాముల ఐలయ్య ,గాదె కేశవ రెడ్డి, ఓరుగంటి బిక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: