CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉రేషన్‌ బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత

Share it:


మన్యం టీవీ కొత్తగూడెం జూలై 12:-

270 క్వింటాళ్ల బియ్యంను పట్టుకున్న టాస్క్‌పోర్స్‌ పోలీసులు

పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని అడ్డదారుల్లో తరలిస్తుండగా టాస్క్‌పోర్సు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇల్లందు ప్రాంతం నుంచి వస్తున్న ఈ లారీని కొత్తగూడెం సమీపంలోని ఇల్లందు క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం అశ్వాపురం లేదా మణుగూరు ప్రాంతంలోని రైస్‌ మిల్లుకు తరలిస్తున్నట్లుగా సమాచారం. గత కొంత కాలంగా ఇల్లందు ప్రాంతం నుంచి రేషన్‌ బియ్యాన్ని మణుగూరు, అశ్వాపురం ప్రాంతంలోని మిల్లులకు తరలించి వాటిని పాలిష్‌ చేసి తిరిగి మార్కెట్‌లోకి అమ్మకాలు సాగిస్తున్నారు. పౌరసరపరాల శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అక్రమ రేషన్‌ బియ్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై దృష్టి సారించకపోవడం ఈ దందాకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నూతనంగా బాద్యతలు స్వీకరించిన కలెక్టర్‌ అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో అక్రమ రేషన్‌ బియ్యంపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన టాస్క్‌పోర్సు పోలీసులు పెద్ద ఎత్తున లారీలో ఇల్లందు మండలం ఒడ్డుగూడెం నుంచి లారీలో తరలిస్తున్న 270 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే అక్రమ రేషన్‌ తరలింపు వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు మిల్లులపై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికే అక్రమ రేషన్‌ తరలిస్తున్న అశ్వాపురంకు చెందిన మిల్లును సీజ్‌చేసిన అధికారులు ప్రస్తుతం దొరికిన అక్రమ రేషన్‌ బియ్యం తరలిస్తున్న వారిపై పీడి యాక్ట్‌లు నమోదు చేస్తారా..? లేదా..? అనేది వేచి చూడాల్సిందే.

 

Share it:

SLIDER

Post A Comment: