CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి ఉద్యోగుల వయో పరిమితి పెంపు హర్షణీయం

Share it:

 


👉 తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం

మన్యం మీడియా/కొత్తగూడెం(జులై 23)::తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు, సింగరేణి ఉద్యోగులకు కూడా వర్తించేలా తెలంగాణ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని, సింగరేణి ఎస్సీ,ఎస్టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ ఆంతోటి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

కొత్తగూడెం జికే ఓపెన్ కాస్ట్ నందు ఏరియా వైస్ ప్రసిడెంట్ సంగాల పద్మారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో రిటైర్మెంట్ వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 61 ఏండ్లు పెంచవలసిందిగా, అసోసియేషన్ కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు కమిటీ హైదరాబాద్ వెళ్లి, కొల్బెల్ట్ గౌరవ శాసన సభ్యులను కలిసి, సింగరేణిలో 61 యేండ్ల వయో పరిమితి అంశాన్ని వివరించి, వారి నుండి సానుకూల స్పందన, హామీని పొంది, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ద్వారా సింగరేణి గుర్తింపు సంఘం గౌరవాధ్యక్షులు కల్వకుంట్ల కవిత కు,  పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్, నేత పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ,ప్రభుత్వ విప్ బాల్కన్ సుమన్, పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విప్ రేగా కాంతారావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ లకు విన్నవించి,వారిద్వారా తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఒప్పించి,   సింగరేణి ఉద్యోగుల వయోపరిమితిన ప్రభుత్వ వాటా 51% వున్న దృష్ట్యా, అదేవిధంగా పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్ చట్టంప్రకారం సింగరేణిలో 61 యేండ్ల వయోపరిమితిని అమలు చేయించవలసిందిగా ఆదేశాలు ఇప్పించడంలో కృత కృత్యులమైనందుకు ఆనందంగా వున్నదని, మీ అందరి సహకారంతో

అసోసియేషన్ ముందుకు

నడుస్తుందని ప్రసంగించారు. ప్రప్రధమంగా రాష్ట్రస్థాయిలో  ముందడుగు వేసి తమ సంఘం నాయకత్వంలోనే మొదలైసక్సెస్ కావడం జరిగిందని అన్నారు. పద్మారావు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు వేగుచుక్కలా ఎస్సీ , ఎస్టీ అసోసియేషన్ 61 యేండ్ల వయో పరిమితికి దారిచూపి

మాలాంటి వారికి ఎంతో సహకారాన్ని అందించింది అని, అంతోటి నాగేశ్వరరావు కి అసోసియేషన్ నాయకులకు రుణపడి ఉంటామని, సింగరేణి  మైనారిటీ నాయకులు హమీద్ ప్రసంగించారు.అనంతరం జీకే ఓ సి కార్మికుల సమక్షంలో

అంతోటి నాగేశ్వరరావు కు పూల మాలలు, శాలువాతో ఘనసన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పొనగంటి అంకూస్ కేంద్ర కమిటీ సభ్యులు లక్ష్మి నారాయణ ట్రెజరర్ బొరిమాల పిచ్చయ్య అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ప్రకాష్, మండవ రాజేశ్వరరావు , హమీద్, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: