CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

డ్రైనేజీలు శుభ్రం చేయాలనీ రాజుపేట గ్రామస్తులు కలెక్టర్ విన్నపం

Share it:

 


మన్యంటీవీ మంగపేట.

మంగపేట మండలం 

రాజుపేట లో పల్లె ప్రకృతి లో భాగంగా డ్రైనేజీలు శుభ్రం చేయడానికి గ్రామపెద్దలు తీర్మానంచేసారు.

డ్రైనేజీలు శుభ్రం చేయాలనీ తీర్మానం చేసినా కూడా పూర్తి స్థాయిలో డ్రైనేజీలు శుభ్రం చేయకుండా ఒకటి రెండు చోట్ల నామ మాత్రమే డ్రైనేజీ శుభ్రం చేసి వదిలి వెళ్ళిన గ్రామ పంచాయితీ సిబ్బంది.డ్రైనేజీ లో ఉన్నటువంటి మురుగు నీళ్లు మరియు చెత్త ఎక్కడిదక్కడే ఉండిపోయి అందులో ఉన్న చెత్త చెదారం కుళ్ళిన వాసనకు ఈగలు దోమలతో పగలు ఈగలతో రాత్రులు దోమలతో ఇబ్బందికరంగా మారింది. రోడ్డుపై వెళ్తున్న బాటసారులు సైతం  ఇబ్బంది పడుతున్న పరిస్థితి.రోడ్డు పక్కన జనులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదు. భూపాలపల్లి జిల్లా ఉన్నపటినుంచి  అధికారులకు  పలుసార్లు విన్నవించుకున్నా కూడా ఈ తంతు మారలేదు,ములుగు జిల్లా గా మారినాకూడా  జిల్లా అధికారులకు కూడా తెలియ జేసిన కూడా పట్టించుకోలేదు. ఈ సమస్య పై  పల్లికొండ యాదగిరి, నిమ్మగడ్డ ప్రవీణ్ జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు సమస్యను వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరగా తప్పకుండా చేస్తాని పంచాయితీ సిబ్బందికి తెలియజేసారు. సాక్షాత్తు కలెక్టర్ చెప్పిన కూడా రాజుపేట పంచాయతీ సిబ్బంది డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడం పంచాయతీ సిబ్బంది నిలువెత్తు నిర్లక్ష్యం కన్పిస్తుంది. ఈ విషయం పునరావృతం కాకుండా చూసుకోవాలని మరల ఇదే పునరావృతం అయితే కలెక్టర్ కు మరల పిర్యాదు చేయవలసివస్తుంది అని ఈ సందర్బంగా గ్రామస్తులు తెలియజేసారు.రాజుపేట గ్రామ పంచాయతీ లోని డ్రైనేజీలు శుభ్రం చేయాలి. ఎప్పటి చెత్తను అప్పుడే శుభ్రం చేయాలి. డ్రైనేజీల అపరిశుభ్రత వలన పెరిగిన ఈగల, దోమల  సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share it:

Post A Comment: