CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, విద్యాశాఖ అధికారి  సోమశేఖరశర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల, ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల అంతర్జాల తరగతుల కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేస్తూ,  విద్యార్థులు విధిగా తరగతులు దూరదర్శన్, లేదా స్మార్ట్ మొబైల్, ద్వారా వినునట్లుగా చూడాలని, ఆదేశించారు. అందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని,  ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పరీక్షించాలని తెలియజేశారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయుల, డైరీ లను పరిశీలించారు.  విద్యార్థులు ఏ విధంగా ఆన్ లైన్ క్లాసులు వింటున్నారో పట్టిక ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుల దగ్గర ఉండాలని ఆదేశించారు.  విద్యార్థులు ఆన్ లైన్ తరగతుల పర్యవేక్షణకై విద్యార్థుల ఇండ్లను తరచుగా సందర్శించి, నమోదు చేసుకోవాలని అన్నారు. అన్ని తరగతులకు విధిగా జూమ్ తరగతులు నిర్వహించాలని తెలిపారు.  పాఠశాలల డైస్ నివేదికలను తనిఖీచేసి, ఇంకాపూర్తి చేయ్యని పాఠశాలలు వెంటనే డేస్ ఫారాలు అందజేయాలని ఆదేశించారు.  ఈ సందర్భంగా స్థానికులు  జిల్లా విద్యాశాఖ అధికారి ని కలసి ప్రాథమిక, ప్రాథమికోన్నత, పాఠశాలల ఉపాధ్యాయులు, సమయపాలన పాటించడం లేదని తెలిపారు. స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ఈ ఓ,  స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాలను తరచుగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. కొందరు ఉపాధ్యాయులు, వ్యాపారాలు చేస్తున్నారని, వారి వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ, పిల్లలపై, పాఠశాలలపై, కనబర్చటం లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేయగా,  మండల విద్యాశాఖ అధికారి ని శనివారం వరకు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  జిల్లా విద్యాశాఖ అధికారి వెంట ఎమ్ ఈ ఓ  వెంకట్, ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాసరావు,  ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: