CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లయన్స్ క్లబ్ మణుగూరు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లయన్స్ క్లబ్ మణుగూరు 27వ ప్రెసిడెంట్ గా ముత్తంశెట్టి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా గాజుల. పూర్ణ చందర్ రావు, కోశాధికారిగా భూక్యా. తారప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిటిపిఎస్ సి ఈ బాలరాజు,ఇమిడియట్ పాస్ట్ గవర్నర్ డా.వై.మోహన్ రెడ్డి లు విచ్చేశారు.నూతన కార్యవర్గ సభ్యులతో పాస్ట్ జిల్లా గవర్నర్ కాప.మురళీ కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు.లయన్ శివ ప్రసాద్,వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 12 మంది నూతన సభ్యులను క్లబ్ లోనికి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి   మాట్లాడుతూ,గత 27 సంవత్సరాలు గా పేద ప్రజలకు కష్ట కాలంలో సేవలు అందించే క్రమంలో, లయన్స్ క్లబ్ మణుగూరు ఎనలేని కృషి చేస్తుందని అన్నారు.మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో,ఎక్కడ కష్టం ఉంటే,అక్కడ లయన్స్ క్లబ్ మణుగూరు ఉంటుందనే విధంగా ప్రజల నోట్లో నాలుకల తయారైందని, ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు. లయన్స్ క్లబ్ మణుగూరు ప్రమాణ స్వీకారం రోజునే, వికలాంగుల యగ్గడి.సతీష్ కు,కె.చంద్ర మోహన్ దాత మరొక అతిధి యారాల. ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ట్రై సైకిల్ అందించి,సేవా దృక్పథం చాటారు.గత సంవత్సరం కొవిడ్ లాక్ డౌన్ సమయంలో,కోవిడ్ సోకిన వారికి నెల రోజుల పాటు ఉచితంగా భోజనం పంపిణీ చేసిన తార ప్రసాద్,అమ్మ గారైన కాంతమ్మ ను ముఖ్య అతిథులు సన్మానించారు. గత 27 సంవత్సరాలు గా, లయన్స్ క్లబ్ మణుగూరు సేవా కార్యక్రమాలను చేయుటకు ముఖ్యకారకులు అయిన క్లబ్ వ్యవస్థాపకులు పిల్లారిషెట్టి.హరిబాబు ను ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డును పాస్ట్ ఇంటర్నేషల్ కౌన్సిల్ మెంబర్ గోపాల్ రెడ్డి ప్రకటించటం జరిగింది.ఈ కార్యక్రమం చైర్మన్లుగా కె.చంద్ర మోహన్,తార ప్రసాద్ లు వ్యవహరించారు. భాద్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్,సెక్రటరీ,ట్రెజరర్ లకు పట్టణ ప్రముఖులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్, వాసవీ క్లబ్,ఆశ్వపురం, పినపాక క్లబ్ సభ్యులు హాజరై సన్మానించారు. ఈ కార్యక్రమంలో డా.బాల కృష్ణ,డా.కోటేశ్వర రావు,డా. శశిధర్,డా.సమ్మయ్య,కృష్ణ మోహన్,చందు,బేతచర్ల. వెంకటేశ్వర రావు,కురాకుల. శ్రీనివాస్,సి హెచ్.రాంబాబు, నూతన సభ్యులు ఎన్. వెంకటేశ్వర రావు,అడబాల. నాగేశ్వర రావు,పుల్లయ్య, భూక్యా.లోకేష్,కరిముల్ల,ఎన్.శ్రీనివాస్,జ్యోతి,సారిక,రామ మెడికల్ సత్యనారాయణ,రాధ శ్యామ్ గుప్తా,శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: