CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి షెల్ పికింగ్ కాంట్రాక్ట్ పనులు సివిల్ ఆధ్వర్యంలోనే కొనసాగించాలి

Share it:

 



సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యూ ఆధ్వర్యం లో ధర్నా ఎస్ ఓ టూ జీఎం.డి.లలిత్ కుమార్ కు వినతిపత్రం అందజేత


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి వ్యాప్తంగా వివిధ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు,కాల్ స్క్రీనింగ్ ప్లాంట్ లు ఓపెన్ కాస్ట్ గనుల లో షెల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కొత్త ప్రతిపాదన పర్చేజ్ విభాగంలో క్వాంటం టెండర్ గా కాకుండా,ఇంతకు ముందు లాగానే సివిల్ ఆధ్వర్యంలోనే మస్టర్ లింక్డ్ జనరల్ టెండర్ గానే కొనసాగించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో జీఎం ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్ ఓ టూ జీఎం.డి.లలిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు ఏ మంగీలాల్ మాట్లాడుతూ షెల్ పికింగ్ టెండర్ పనులపై ఒక్క మణుగూరు లోనే కొండాపురం సీఎస్పీ,ఓసి- 4, మణుగూరు ఓపెన్ కాస్ట్ గనులలో మొత్తం 54 మస్టర్ లకు గాను సుమారు 70 మంది వరకు సింగరేణి భూనిర్వాసితులు మరియు స్థానిక నిరుపేదలు ఉపాధి పొందుతున్నారని,సెమీ స్కిల్డ్ పని నుండి పర్చేజ్ క్వాంటమ్ యూనిట్ టెండర్ గా మార్చడంతో అనేకమంది ఉపాధికోల్పోనున్నారని,తెలిపారు.ఒక్క ఓసి-4లోనే రోజుకి 18 మస్టర్ లకు 23 మంది ఉపాధి పొందుతున్నారని,వారు కూడా పూర్తిగా నిర్వాసితులనీ నూతన యూనిట్ టెండర్ల ప్రకారం రోజుకి ఆరు మస్టర్స్ కి మాత్రమే యాజమాన్యం అనుమతించిందని దీంతో ఒక ఓసి-4 లోనే సుమారు 15 మంది ఉపాధి కోల్పోయే అవకాశం కూడా ఉందన్నారు.ఇలా సింగరేణి వ్యాప్తంగా అనేక మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు.గతంలో కూడా యూనిట్ లెక్కన కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్లు మరియు కార్మికులు కూడా నష్టపోయారని దీంతో ఈ పనులకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సింగరేణి బొగ్గు నాణ్యతపై కూడా ప్రభావం పడిందని,ఈ విషయాన్ని అధికారులు గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి పాత పద్ధతిలోనే సివిల్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలోనే టెండర్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు.సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో షెల్ పికింగ్ కాంట్రాక్ట్ కార్మికులు రాజేష్, లక్ష్మీనారాయణ,వెంకటేశ్వర్లు,ఓసి-4,సీఎస్పీ,ఎంఎన్జి ఓసి కాంట్రాక్ట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: