CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నరకప్రాయంగా పోట్లపల్లి - ఎల్లాపురం రోడ్డు

Share it:

 


పినపాక మండలం పొట్లపల్లి నుండి ఎల్లాపురం వెళ్లే రహదారి చిన్న చినుకు పడితే చిత్తడిగా తయారవుతుంది. గత 30 ఏళ్ల నుండి ఇదే పరిస్థితి అని ఎల్లాపురం గ్రామస్థులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు, వినతి పత్రాలు ఇచ్చిన ఈ రోడ్డుకు మోక్షం కలిగించడం లేదు.  ఆ దారి వెంట నడవాలంటే  నరకప్రాయం గా మారింది. గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు ఈ రోడ్డుపై నడిచి వెళ్లే పరిస్థితి లేదు. ఫలితంగా వాహనదారులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి  తక్షణమే సిసి రోడ్డు నిర్మాణం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తక్షణమే రహదారి ని బాగు చెయ్యాలి: తోలెం శ్రీను

ఎల్లాపురం గ్రామస్థులకు వర్షాకాలం వచ్చిందంటే నరక ప్రాయం గా ఉంది.ఐ టీ డీ ఏ అధికారులు దృష్టి సారించి రహదారి ని మెరుగు పరచాలని ఆదివాసీ సంఘం నాయకులు తోలెం శ్రీను కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: