CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహర్దశ

Share it:

 




 మాన్యం మనుగడ దుమ్ముగూడెం: రాష్ట్ర రవాణా శాఖ  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

దుమ్ముగూడెం మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలు నాటి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.   పల్లె ప్రకృతి వనం ను ప్రారంభించారు.

దుమ్ముగూడెం   మంత్రి మాట్లాడుతూ

గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ముఖ్యమంత్రి కేసీఆర్  పల్లె, పట్టణ ప్రగతి అనే మహత్తర కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని వివరించారు.

గ్రామాలకు పూర్వ వైభం రావాలంటే, గ్రామాల స్వరూపం మారాలంటే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోక తప్పదన్నారు.


గ్రామాల్లో పరిశుభ్రత, అభివృద్ధి కోసమే పల్లెప్రగతి కార్యక్రమని, పల్లెలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, తమ ఇంటితో పాటుగా ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యతన్నారు.


అందరం కలిసి పని చేస్తేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాలలో నేటి నుంచి పదిరోజుల పాటు పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. 


పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటుగా పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించుకోవాలన్నారు.


గ్రామాల అభివృద్ధితో భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించవచ్చు. అందుకే హరితహారం ద్వారా విరివిగా మొక్కలు నాటాలని, మనకు కేటాయించిన టార్గెట్ మొక్కలను విధిగా నాటాలన్నారు. 


హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందని, గ్రామాల్లో పచ్చదనం పెంచాలి, మొక్కలు నాటడం, నాటిన మొక్కలను సంరక్షించకపోతే వారిపై వేటు వేయాలని చట్టం కూడా చేయడమైందన్నారు. 


గ్రామాల్లో సభలు నిర్వహించుకోవలని, సభలలో వచ్చిన సమస్యలను అందరిని భాగస్వామ్యం చేసి పరిష్కరించుకోవాలని సూచించారు. 


మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి పరిశుభ్రమైన త్రాగునీరు అందుతుందని, ఇంటింటికి త్రాగునీరు, గుంటగుంటకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యమన్నారు. 

దళితుల అభివృద్ధికి తెచ్చిన సాధికారత ద్వారా అబివృద్ది సాధించాలన్నారు.  జనాభా ప్రాతిపదికన ప్రతి నియోజకవర్గంలో 100 మందికి ఎంపిక చేసి 10 లక్షలతో ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. స్వాతంత్ర్య ము సిద్దించి 75 సంవత్సరాలు అయినా ఎస్సిలు అంబెడ్కర్ ఆశించిన స్థాయిలో  అబివృద్ది చెందలేదని గమనించిన ప్రభుత్వం దళిత సాధికారత తెచ్చిందని చెప్పారు. పథకాలు మంజూరు ఎంతో పారదర్శకంగా చేపడతామని, ఎవరి పైరవీలు ఉండవని చెప్పారు.  పథకం సమర్థవంతంగా వినియోగించుటలో దళిత సంఘాలు సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.  ఈ 

కార్యక్రమాల్లో మహబూబాద్  ఎంపీ మలోత్ కవిత, విప్ రేగా కాంతారావు, జెడ్పి చైర్మన్ కోరం కనకయ్య,  జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొందేం వీరయ్య,  ITDA పిఓ  గౌతమ్, ఎస్పీ సునీల్ దత్, అదనపు ఎస్పీ వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,  అటవీ, రెవెన్యూ, పంచాయతీ అధికారులు,  ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: