CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెండు గ్రామాల భూముల విభేదాలను పరిష్కరించడానికి కాలినడకన వెళ్తున్న భద్రాచలం శాసనసభ్యులు ....

Share it:

 




 మాన్యం మనుగడ దుమ్ముగూడెం:

 ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు దుమ్ముగూడెం మండలం లో స్తులు తొలగించి 40 ఎకరాల భూమిని సదును చేసినారనే అభియోగాన్ని గౌరవ శాసనసభ్యులు వారికి రెండు రోజుల క్రితం తెలియజేయడం జరిగింది, వారి విభేదాలు తారాస్థాయికి చేరి కొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి, ఈ విషయం తెలుసుకుని స్వయంగా తానే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బురదమయం అయిన రోడ్లలో ట్రాక్టర్లులో ఆటోలు లో ప్రయాణించి ఆ గ్రామాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులతో మాట్లాడి మరలా రాయగట్టు గ్రామానికి చేరుకుని అక్కడ రైతులతో కూడా మాట్లాడి, వారు కొట్టుకునే పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరమని ఇది సమన్వయంతో తానే స్వయంగా వచ్చి పరిష్కరిస్తానని అప్పటి వరకూ ఎవరూ సహనం కోల్పోకుండా ఎటువంటి తప్పులు చేయకుండా సంయమనం పాటించాలని రెండు గ్రామాల గిరిజనులను కోరారు, గౌరవ శాసనసభ్యులు వారు ఇంత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మా బాధలు తెలుసుకోవడానికి మా గొడవలను పరిష్కరించడానికి మా గ్రామాలకు రావటం చాలా సంతోషదాయకమని గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇది చాలా మంచి పరిణామమని అందరూ అభినందించారు ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు గారితో పాటు భద్రాచలం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నల్లపు దుర్గా ప్రసాద్ ,, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు , పిలక వెంకటరమణా రెడ్డి , దర్శి సాంబశివరావు , తెల్లం హరి కృష్ణ సర్పంచ్ సోడి చలపతి , యువజన నాయకులు ఉబ్బ వేణు , లంక శివ , తెల్లం నరేష్ తదితరులు పాల్గొన్నారు..*

Share it:

TELANGANA

Post A Comment: