CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉టీచర్లకి నాన్ టీచింగ్ స్టాఫ్ కి మొత్తం నెలసరి వేతనం అందించాలి.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం జూలై, 20:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తమ స్కూల్ లో పని చేస్తున్నటువంటి టీచర్లకి నాన్ టీచింగ్ స్టాఫ్ కి మొత్తం నెలసరి వేతనం అందించాలని మరియు ఆన్ లైన్ క్లాసులో పేరుతో అక్రమంగా అన్యాయంగా పెండింగ్ ఫీజులను వసూలు చేయరాదని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ డిమాండ్ చేశారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో తల్లిదండ్రుల దగ్గర నుంచి తమ దగ్గర చదివే విద్యార్థుల ఫీజు మొత్తం పోయిన సంవత్సరం నుంచి కట్టించుకుంటూ పోయిన సంవత్సరం మొత్తం ఫీజు కట్టకపోతే ఈ సంవత్సరం ఆన్లైన్ క్లాసులకు లింకు ఇవ్వమని అన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను ఇబ్బంది చేస్తున్నారు ఈ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు అందరూ విద్యార్థులు పోయిన సంవత్సరం ఫీజు మొత్తం కట్టేస్తున్నారు ఈ సంవత్సరం కూడా సగం ఫీజు కడుతున్నారు టీచర్లకు మాత్రం సగం వేతనం మరియు 20% 30% అని మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు ఈ కరోనా కష్టకాలంలో ప్రైవేట్ టీచర్లు అనేక ఇబ్బందులు పడుతూ తమ కుటుంబాలను వెళ్లదీస్తున్నారని కోటా శివశంకర్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డి ఈ  ఓ, వెంటనే స్పందించి స్కూల్ లో పని చేస్తున్నటువంటి టీచర్ లందరికీ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ జూన్ నెల నుంచి మొత్తం వేతనం అందించాలని ఆ విధంగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి కోట శివ శంకర్ విజ్ఞప్తి చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: