CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భవిష్యత్ సీఎం రేవంత్ రెడ్డి:వేముల భారతి

Share it:

 


👉టీపీసీసీ అధ్యక్షుడిని మర్యాద పూర్వకంగా  కలిసిన ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ 

👉ములుగు ఎమ్మెల్యే సీతక్క ని పరామర్శ

మన్యంటీవీ, అశ్వారావుపేట:టీ పీసీసీ నూతన అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మర్యాద పూర్వకంగా కలిసిన  అశ్వారావుపేట ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రే భారతి నా తోబుట్టువుతో సమానం అని రేవంత్ రెడ్డికి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిచయం చేసారు. మీరు మాదగ్గరకు రావడానికి ఎప్పుడు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదన్న రేవంత్ రెడ్డి, సీతక్క ఇరువురి మాటలకూ ఉప్పొంగిన ఎంపీటీసీ దంపతులు. అశ్వారావుపేట ఎంపీటీసీ వేముల భారతి అలియాస్ జూనియర్ సీతక్క బుధవారం హైద్రాబాద్ పర్యటించి సీతక్క తల్లి అయినా ధనసరి సారమ్మ అనారోగ్యం తో, ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమెను చూసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అనంతరం సీతక్క కోటర్స్ లో బసచేసి జిల్లా రాజకీయ పరిస్థితులు ముచ్చటించారు. గురువారం సీతక్క ఆధ్వరంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సూతనంగా ఎన్నుకోబడిన టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్ రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ సందర్బంగా ఎంపీటీసీ వేముల భారతి మాట్లాడుతూ రేవంత్ అన్న సీతక్క నాయకత్వంలో పార్టీ సీనియర్ నేతల సలహాల మేరకు రాష్టంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మావంతు కృషి చేస్తామని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నామని పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కజేయబోమని. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కి పూర్వవైభవం తిరిగి వస్తుందని కొనియాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అలాగే బీజేపీని అసలు సమ్మే పరిస్థితిలో లేరని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సమయంలో ఢిల్లీలో ఉన్న పెద్దలు సరైన నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ మాత్రమే సాధ్యం అని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: