CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వెంగళరావు చెరువు ప్రాజెక్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్

Share it:

 


  చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:


చండ్రుగొండ మండల పరిధిలోని సీతాయిగూడెం గ్రామంలో ఉన్న వెంగళరావు సాగర్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత సంవత్సరం భారీవర్షాలకు అలుగు కొట్టుకుపోవడంతో ఆయకట్టు సాగు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్ కోసం తాత్కాలికంగా 9.9 లక్షలతో ప్రాజెక్ట్ బండిగ్(అలుగు) పనులను ప్రారంభించారు. ఈ పనులను గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గతంలో వర్షాకాలంలో వచ్చిన వరదల కారణంగా అలుగు తెగి రైతులు ఇబ్బందులు పడ్డారని ఈసారి దాన్ని దృష్టిలో ఉంచుకుని 9.9 లక్షలతో తాత్కాలిక అలుగు నిర్మాణం పనులు చేపట్టామన్నారు. పనులు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టామని ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. పనుల విష్యంలో ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక మండల అధికారులు సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈసారి రైతులు ఎవరూ అధైర్య పడవద్దని ప్రాజెక్ట్ పటిష్టంగా ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించి శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు. అనంతరం చండ్రుగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. మలేరియా మరియు ఇతర సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంవత్సరం మలేరియా కేసులు నమోదు కావద్దని దానికి కావలసిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కరోనా వైరస్ పూర్తిగా తగ్గలేదని ఏదైనా గ్రామంలో ఐదు పాజిటివ్ కేసులు నమోదైతే వెంటనే ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించి గ్రామస్తులు అందరికీ పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను అక్కడే అందజేయాలన్నారు. ఇక్కడ ఎంత మంది డాక్టర్లు పనిచేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఒక్కరే డాక్టర్ పనిచేస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. ఉదయం పూట డాక్టర్ ఉంటారు. రాత్రి సమయంలో స్టాఫ్ నర్స్ లే ఆసుపత్రిని నడిపిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రి మొత్తం కలియతిరిగి అన్ని గదులను పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. అక్కడి నుంచి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తమ వద్దకు వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలన్నారు. ఎవరైనా పని పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కీసరి శాంతమ్మ, మల్లిపెద్ది లక్ష్మీ భవాని, డిఈ కృష్ణ శంకర్, ఈఈ సురేష్ కుమార్, ఏఈ చంద్రశేఖర్, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహశీల్దార్ ఎం ఉష శారద, ఎంపీడీవో జి అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరామ్, ఆర్ఐ ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: