CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్థానిక సమస్యలను పట్టించుకోని అధికారులు

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


 గ్రామాల్లో స్థానికంగా ఉన్న అనేక సమస్యలను గ్రామ అధికారులు పట్టించుకోవడం లేదనే గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ గ్రామ కమిటీ సమావేశం ఇందారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య.అతిథిగా జిల్లా నాయకులు  రత్నం. ప్రవీణ్ జాగటి. చిన్న హాజరయ్యారు ఈ కమిటీ సమావేశంలో గ్రామ యువకులు మాట్లాడుతూ వర్షాకాలం సమయంలో గ్రామం లోని వివిధ వీధుల్లో ఉన్న గుంతల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు చీడపురుగుల ప్రమాదం ఉంటుందని అదే విధంగా గ్రామంలో కరోనా బారినపడిన వీధుల్లో కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లించడం లేదు శానిటేషన్ కూడా చేయడం లేదు. అదేవిధంగా గ్రామపంచాయతీ ముందు లో ఉన్న చేతి పంపు పనిచేయడం లేదు దాన్ని బాగు చేయడం లేదు గ్రామంలోని రైతులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్లే దారి  అతి దారుణంగా తయారయింది దాని నిర్మాణం కోసం కొన్ని డబ్బులు కేటాయించినప్పటికీ ఆ పనిని పూర్తి చేయాలని జిల్లా చైర్ పర్సన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ గ్రామ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని దాని వల్ల రైతులు వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు  గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని వర్షాకాలం ఉన్నందున వీధులన్నీ పరిశుభ్రంగా ఉండేవిధంగా బ్లీచింగ్ పౌడర్ శానిటేషన్ చేయాలని దోమల మందు పిచికారి చేయాలని లేనియెడల వాటి వల్ల అనేక మంది ప్రజలు రోగాల బారిన పడతారని ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆయా సమస్యల పైన పని చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని జిల్లా నాయకుల దృష్టికి తీసుకు వచ్చారు అనంతరం  జిల్లా నాయకులు రత్నం ప్రవీణ్  మాట్లాడుతూ స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్షాకాలం ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయా సమస్యల పైన యువకులు అధికారులను ప్రశ్నిస్తే వారిని బెదిరింపు గురి చేయడం సిగ్గుచేటని సమస్యలు పరిష్కరించక పోగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటు అని  వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు  లేనియెడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది డివైఎఫ్ఐ నూతన గ్రామ కమిటీ అధ్యక్షులు గా బట్ట సందీప్* *కార్యదర్శిగా ఇందారపు రమేష్* *ఉపాధ్యక్షులుగా* *తోకల నాగభూషణం* *మంచర్ల నరహరి* *ఎం విష్ణు సహాయ కార్యదర్శులు గా అంజి బాబు* *ప్రవీణ్ కుమార్* *కుమార్ ల కమిటీ సభ్యులుగా రఘు దయాకర్ కృష్ణ శ్రావణ్ సందీప్ బాబు సాయి కుమార్  గణేష్ అభిరాం సాయి తేజ మిరాజ్ ఖాన్ తదితరులు ఎన్నికయ్యారు

Share it:

Post A Comment: