CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

🔆వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం ఏర్పాటు చేయాలి.

Share it:




🔆కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం చెల్లించాలి.


🔆వ్యవసాయ కార్మికులకు నెలకు రూ. 5వేలు పింఛన్ చెల్లించాలి.


మన్యం టీవీ పాల్వంచ:-

వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని *వ్యవసాయ కార్మిక సంఘము(BKMU) జిల్లా సహాయ కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు* కోరారు. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శనివారం స్థానిక తహశీల్దార్ కు 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారోనా మహమ్మారి వలన వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి నెలకు రూ. 7500/-, 50 కేజీ ల బియ్యం అందించాలిని కోరారు. కరోనా తో మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం చెల్లించాలిని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికులకు నెలకు రూ. 5000/- పెన్షన్ ఇవాళని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద 200 రోజుల పని దినాలను పెంచి రోజుకు 600/- చెల్లించాలని కోరారు. *ఈ కార్యక్రమంలో రైతు సంఘము నాయకులు అడుసుమల్లి సాయిబాబు, బండి నాగేశ్వరరావు, అన్నరపు వెంకటేశ్వర్లు, జ్యోతుల రమేష్, పి. రాంబాబు, వెంకటేశ్వర్లు, శాంత, కుమారి, పద్మ, క్రాంతి, విజయ, రాణి, నిర్మల* తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: