CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరదతో పంటపొలాలను ముంచి, గ్రామంలోని ఇండ్లలోకి నీరు చేరి

Share it:


 

🔥 కొమ్ముగూడెం నుండి అనంతారం వరకు బిటి రోడ్డు నిర్మాణ జాప్యం దుస్థితి

🔥ఆర్ అండ్ బి శాఖ అధికారులు స్పందించార?

🔥కలెక్టర్ కి ఫిర్యాదు చేయనున్న కొమ్ముగూడెం గ్రామస్థులు

మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని కొమ్ముగూడెం నుండి అనంతారం వరకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 7.50 కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణం 418.69 లక్షల రూపాయల తో చేపట్టిన పనులు నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, చిన్న వర్షాలకే రోడ్డు దెబ్బతింటుందని, కోతకు గురవుతుందిని, నాణ్యతలేని ఇసుకను వాడుతున్నారని, గ్రామాలలో సి సి రోడ్డు, సైడ్ డ్రైనేజీలు నిర్మించడం లేదని, వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా కాలువలు తీయకపోవడంతో గురువారం రాత్రి పడ్డ వర్షానికి వర్షపు నీరంతా కొమ్ముగూడెం గ్రామ సమీపంలో పంటపొలాలను ముంచెత్తి, గ్రామంలోని ఇండ్లలోకి నీరు వస్తుందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: