CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్థానిక సమస్యలను పట్టించుకోని అధికారులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

గ్రామాల్లో స్థానికంగా ఉన్న అనేక సమస్యలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వాడగూడెం పంచాయతీ కార్యదర్శి సలీం పాషా వినతిపత్రం అందజేయడం జరిగింది యువత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది  వాడ గూడెం లో గ్రామ సమావేశం  కేతిన శీను అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ( టీ,ఏ,జీ,ఎస్ ) కొమరం సందీప్ కుమార్ హాజరయ్యారు.భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మంగపేట మండలం కమిటీ నాయకులు ఇందారపు రమేష్ ఈ కమిటీ సమావేశంలో గ్రామ యువకులు మాట్లాడుతూ మంగపేట మండలం వాడగూడెం వర్షాకాలం సమయంలో గ్రామం లోని వివిధ వీధుల్లో ఉన్న వీధి దీపాలు రోడ్డు రోడ్లు సైడ్ కాలవలు గుంతల్లో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు చీడపురుగుల ప్రమాదం ఉంటుందని అదే విధంగా గ్రామంలో  శానిటేషన్ కూడా చేయడం లేదు అదేవిధంగా  గ్రామంలోని రైతులు వ్యవసాయ కూలీలు వ్యవసాయ భూముల దగ్గరికి వెళ్లే దారి  అతి దారుణంగా తయారయింది దాని నిర్మాణం కోసం కొన్ని డబ్బులు కేటాయించినప్పటికీ ఆ పనిని పూర్తి చేయాలని  పట్టించుకున్న పాపాన పోలేదని దాని వల్ల రైతులు వ్యవసాయ కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని వర్షాకాలం ఉన్నందున వీధులన్నీ పరిశుభ్రంగా ఉండేవిధంగా బ్లీచింగ్ పౌడర్ శానిటేషన్ చేయాలని దోమల మందు పిచికారి చేయాలని లేనియెడల వాటి వల్ల అనేక మంది ప్రజలు రోగాల బారిన పడతారని ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆయా సమస్యల పైన పని చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని  అనంతరం   స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని వర్షాకాలం ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఆయా సమస్యల పైన యువకులు అధికారులను ప్రశ్నిస్తే వారిని బెదిరింపు గురి చేయడం సిగ్గుచేటని సమస్యలు పరిష్కరించక పోగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం సిగ్గు చేటు అని  వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల టీ,ఏ,జీ,ఎస్ డి,వై,ఎఫ్, ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు 

ఈ కార్యక్రమంలో

ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు

తోకల రవి

డివైఎఫ్ఐ నాయకులు

నరహరి,

అంజి బాబు

గ్రామస్తులు

మహేష్ ,గంగా ప్రసాద్ ,శ్రీను , సతీష్ ,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: