CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్సీ కార్పొరేషన్ ద్వార దళితులకు రుణాలు మంజూరు చేయాలని బీఎస్పీ డిమాండ్..

Share it:

 మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై  11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,జూలూరుపాడు మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ పెద్ద హరిజనవాడ లో ఆదివారంనాడు బహుజన సమాజ్ పార్టీ మండల అద్యక్షుడు తంబర్ల నరసింహారావు ఆద్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరసింహారావు  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్ష ఫలాలు గా ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితులు ఎక్కువ శాతం అభివృద్ధి చెందుతారనుకొని రాష్ట్ర సాధనలో పాల్గొని పోరాడిన దళితులకు అన్యాయమే జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి దళితుడే మొదటి ముఖ్యమంత్రిని చేస్తాం,దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని,  చెప్పిన మాటలు గుర్తుచేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రుణాలు ఇచ్చే దిక్కులేదుఅన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ శాతం పేదవారు, దళితులే, ఉన్నరని రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి దళితులదని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇస్తే దళితులు తమ కాళ్ల మీద నిలబడతామని అనుకుంటున్న దళితులకు రోజులు, నెలలు, గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోవడం విడ్డూరమని ఆయన అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పరిస్థితి ఆలోచించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రతి ఒక్కరికి రుణాలు మంజూరు చేయ్యలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి సైదులు,కొత్తపల్లి గోపాల్,వెంకటరామయ్య,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: