CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బడి ఈడు పిల్లలందరు బడిలోనే నమోదు కావాలి

Share it:

 


బాల కార్మికులు గా మార్చిన వారిపై కఠిన చర్యలు తప్పవు

సీఐ కిరణ్ కుమార్.


మన్యం టీవీ మంగపేట.


బడి ఈడు పిల్లలని బాల కార్మికులుగా పని చేయించినట్లయితే పని చేయిస్తున్న తల్లిదండ్రులపై మరియు సంస్థల యాజమాన్యాలపై చట్టపరంగ కఠిన  చర్యలు తప్పవు అని 

సట్ల కిరణ్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏటూర్ నాగారం ఈ సందర్బంగా తెలియజేసారు.

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  బాలల సంరక్షణ కోణంలో ప్రతిష్టాత్మకంగా  ఆపరేషన్ ముస్కాన్7  కార్యక్రమం చేపట్టింది  అందులో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశానుసారం  జూలై నెల మొత్తం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు కొనసాగుతాయి. 

 ఈ కార్యక్రమంలో భాగంగా మంగపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆపరేషన్ ముస్కాన్ మండల కమిటీ సభ్యులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో   ఏటూరునాగారం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సట్ల కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగపేట మండలాన్ని బాలకార్మిక రహిత  ప్రాంతంగా రూపొందించడంలో స్థానిక ప్రజలు, పౌర సమాజం తీసుకోవాలని అలాగే బడిఈడు పిల్లలు అందరూ బడిలో నమోదు కావాలని అలా నమోదు కాకుండా బాల కార్మికులుగా పని చేయిస్తున్న తల్లిదండ్రులను మరియు సంస్థల యజమానుల  పై సంబంధిత చట్టాల రీత్యా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

 ములుగు జిల్లా బాలలపరిరక్షణ సమితి లీగల్ ఆఫీసర్ రాచపల్లి సురేష్ కుమార్ మాట్లాడుతూ మండల ప్రజలందరూ బాల సంక్షేమంపై దృష్టి పెట్టాలని వారి హక్కులకు భంగం కలిగించరాదని, బాల్య వివాహాలు, బాల కార్మికులు మరియు అక్రమ దత్తత తదితర అంశాలపై  పట్టుబడిన నేరస్తుల పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో,పోలీసు సిబ్బంది  మరియు ఆపరేషన్ ముస్కాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: