CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంక్షేమం లో దేశానికే తెలంగాణ ఆదర్శం

Share it:

 



మణుగూరు మండలం లో ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన విప్ రేగా కాంతారావు


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని కిన్నెర కళ్యాణ మండపంలో మణుగూరు తహసీల్దార్ చంద్ర శేఖర్ అధ్యక్షత న ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని, లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని, సీఎం కేసీఆర్ దేశం ఎక్కడ లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలు చేసి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారన్నారు. వృద్దులకు పింఛన్లు,పేదలకు కళ్యాణ లక్ష్మీ,రైతులకు రైతు బంధు, రైతు భీమా,లాంటి పధకాలు అమలు చేస్తున్నారన్నారు అని తెలిపారు.కరెంట్ సమస్యలు తొలిగించమని,24 గంటల కరెంట్ అందిస్తున్నామని అన్నారు.కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ను 3 సంవత్సరాల లో పూర్తి చేసి ప్రజలకు అకింతం చేసారని, తెలంగాణ ప్రజల పట్ల సిఎం కేసీఆర్,టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు.పేద,బడుగు బలహీన వర్గాలు,కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజల అందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏ మంచినీరు తాగుతున్నారో,మారుమూల గ్రామీల ప్రాంతాల్లో,గిరిజన గూడెం లలో కూడా గోదావరి నీటిని శుద్ధి చేసి మిషన్ భగీరథ ద్వారా ప్రజలందరికీ మంచినీరు అందితున్నాము అని తెలియజేసారు.కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదలకు సంక్షేమం అగకూడదు అని సీఎం కేసీఆర్ అన్నారని,తెలంగాణ లోని ప్రతి పల్లె,పట్టణం లో,పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు వల్ల పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారని,అంటువ్యాధుల కూడా భారీ గా తగ్గాయి అని తెలియజేశారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలు ను తిప్పుకొట్టారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకం అమలు కాకపోతే ఓట్లు కూడా అడగను అని చెప్పిన నాయకులు కేసీఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలకి ఆహార భద్రత కార్డు తప్పనిసరి కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా మొత్తం గా 12,600 కార్డులు మంజూరు అయ్యాయని,మణుగూరు లో 705 మంది లబ్ధిదారుల కు కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు.ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు, తహశీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ వీరబాబు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,స్థానిక సర్పంచ్ బచ్చల భారతి,ఎంపీటీసీ ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు,సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: