CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాలుగవ విడత పట్టణ ప్రగతి,పల్లె ప్రగతి, కార్యక్రమంలో భాగంగా మణుగూరు లో మొక్కలు నాటిన విప్ రేగా కాంతారావు

Share it:

 


గ్రీన్ తెలంగాణ నే లక్ష్యం: విప్ రేగా కాంతారావు. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు,అధికారులు పార్టీ నాయకులు


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధిలోని గుట్టమల్లారం, కట్టుమల్లారం గ్రామ పంచాయితీలలో జరుగుతున్న నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. అనంతరం మణుగూరు గర్ల్స్ హాస్టల్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలను నాటారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ

పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కోసం సీఎం కేసీఆర్ ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున,32 జిల్లాల‌కు రూ.32 కోట్లు మంజూరు చేశారు అని తెలిపారు.పరిశుభ్రత, పచ్చదనమే ప్రధాన లక్ష్యం అన్నారు.తెలంగాణకు హరితహారం ద్వారా ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ప్రతిబించించేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని విప్ రేగా కాంతారావు కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు, ఎంపీపీ.కారం.విజయకుమారి,తహసీల్దార్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి,మండల స్పెషల్ ఆఫీసర్ రమాదేవి, ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ పి. వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు ఎంపీటీసిలు బాబురావు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు, టౌన్ అధ్యక్షుడు అడపా అప్పారావు,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్, సర్పంచ్ లు కారం. ముత్తయ్య,బచ్చల.భారతి, జ్యోతి,కృష్ణవేణి,ఉప సర్పంచ్లు,పుచ్చకాయల శంకర్,ప్రబుదాస్,పినపాక నియోజకవర్గ మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,టౌన్ యువజన అధ్యక్షులు రుద్రవెంకట్,టిఆర్ఎస్ నాయకులు,ముద్దంగుల కృష్ణ,ఎడ్ల శ్రీను,వేముల. లక్ష్మయ్య,తాత రమణ, గణేష్,శ్రీను,గుర్రం సృజన్, రామకోటి,బాబీజాన్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: