CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్యకర్తకు సాయం అందించిన రేగా

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పాపాల వీరబాబు బావకు ఆరోగ్యం బాగాలేక, ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఆసుపత్రి కి వెళ్ళే ఓపిక లేక రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించడంతో, తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావును మణుగూరు లోని క్యాంపు కార్యాలయంలో కలిసి  తన గోడును విన్నవించుకున్నాడు. ఆయన పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు వెంటనే స్పందించి తక్షణ సాయంగా 20 వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో ఆసుపత్రికి అయిన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా అందిస్తానని, భరోసా కల్పించారు. అడిగిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు కు పాపాల వీరబాబు కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసి, జన్మ జన్మలకు రుణపడి ఉంటామని అన్నారు.

Share it:

Post A Comment: