CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పులి చర్మం తో వ్యాపారం నిర్వహించే అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న ములుగు పోలీసులు

Share it:

 


మన్యం మనుగడ,ఏటూరినాగరం:

 ఏటూరునాగారం పోలీసువారికి నమ్మదగిన సమాచారం రాగ ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్ళ కట్ట బ్రిడ్జి వద్ద అమ్మడానికి సిద్ధంగా ఉన్న పులి చర్మం కలిగి ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.


అనంతరం వారిని విచారించగా వారి పేరు తిరుమలేష్, వాజేడు గ్రామం, ములుగు జిల్లా మరియు సత్యం చండూరు గ్రామం,బీజాపూర్ జిల్లా చత్తీస్గఢ్ రాష్ట్రం అని తెలిపినారు. వీరి వద్ద నుంచి పులి చర్మం 1,హీరో స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం 1, సెల్ఫోన్ ఒకటి స్వాధీనపరచుకొని పంచుల సమక్షంలో జప్తు చేసాము.



వీరి పూర్తి వివరాలు తెలుసుకోగ తిరుమలేష్ వాజేడు గ్రామ నివాసి ఇతను తరచుగా ఇతని బావ చత్తీస్ఘడ్ రాష్ట్రం ,తాళ్ల గూడ మండలం,చండూరు గ్రామ నివాసి అయినటువంటి సాగర్ ను గత నాలుగు సంవత్సరాల నుండి కలుస్తూ ఉండేవాడు. ఒక నెల కిందట సాగర్ ఫోన్ చేసి తన వద్ద పులిచర్మం ఉన్నదని దాన్ని అమ్ముటకు సహాయం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో పులి చర్మం కొనే వారిని వెతికి పెట్టాలని కోరాడు. అనంతరం తిరుమలేష్ ఒక వ్యక్తిని సంప్రదించగా అతను తెలంగాణ రాష్ట్రం నుండి 30 లక్షల రూపాయలకు పులి చర్మం కొనడానికి వేరే అతను సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు. ఈ వివరాలు తిరుమలేష్ సాగర్ కు చెప్పగా పులి చర్మం తిరుమలేష్ కు ఇచ్చాడు. తిరుమలేష్ ఈ పులి చర్మమును సత్యం ఇంటిలో దాచి పెట్టాడు. అనంతరం ఈ రోజు దానిని అమ్మడానికి తిరుమలేష్ మరియు సత్యం ముళ్ళ కట్ట బ్రిడ్జి వద్దకు రాగ పోలీసు ఉన్నతాధికారులు సమాచారం మేరకు సమాచారం అందుకున్న సీఐ ఎటుర్నగరం పోలీసులు నిందితులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ ఏటూరునాగారం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా అటవీ అధికారి ఇన్ఛార్జ్ ఎఫ్ డి ఓ శ్రీ గోపాల్ రావు గారు మరియు ఇతర అధికారులు పులి చర్మం ను పరీక్షించి నిజమైన పులి చర్మం గా నిర్ధారించారు.అనంతరం అటవీ సంరక్షణ చట్టం-1972 ప్రకారం అటవీ అధికారుల సమక్షంలో స్వాధీన పంచనామా నిర్వహించడమైనది. త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటాము. ప్రస్తుతం దొరికిన నిందితులపై అటవీ సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేశాము. తదుపరి విచారణ నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగిస్తాం.

Share it:

Post A Comment: