CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీలో పర్యటించిన మంత్రి సత్యవతి రాథోడ్

Share it:

 


మన్యం మనుగడ, ఏటూరి నాగారం:

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి 4 వ దశ, హరిత హారం 7వ దశ కార్యక్రమంలో భాగంగా నేడు ములుగు జిల్లాలోని ఎటునాగారం ఐటిడిఎ ప్రాంతంలో రొయ్యూరు, పేరూరు, వాజేడు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏటూరునాగారంలో బ్లడ్ బ్యాంకుని ప్రారంభించి, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనాలు సందర్శించి, హరిత హారంలో పాల్గొని మొక్కలను నాటారు.


దళిత వాడల్లో పర్యటించి వారి స్థితిగతులను, అవసరాలను తెలుసుకున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొస్తున్న దళిత క్రాంతి పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు రానున్నాయని ధీమా కల్పించారు.

ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు.

దట్టమైన అడవి ఉన్న ఈ ములుగు ప్రాంతంలో కూడా క్రమంగా అడవులు తగ్గిపోతున్నాయి.

 ఎక్కడ వర్షాలు పడినా, పడకపోయినా ములుగు లో వర్షాలు పడతాయి. దీనిని కాపాడుకోవాలంటే తరిగిపోతున్న అడవులను పునరుద్ధరించు కోవలసిన అవసరం ఉన్నది.

 హరితహారం కార్యక్రమంలో ఫారెస్ట్ బ్లాక్ లలో, ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్కలు నాటి, పర్యావరణ పెంపునకు అందరూ సహకరించాలని కోరుతున్నాను.

ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు సైడ్ కాలువలకు 10 లక్షల మంజూరు చేశారు.

పల్లె ప్రగతి లో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలను వినియోగంలోకి తీసుకురావాలి. మరుగుదొడ్లను ఉపయోగించేలా చర్యలు చేపట్టాలి. దళితవాడలో పర్యటించి అధికారులు వారి అవసరాలు తెలుసుకుని పరిష్కారం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలి.

పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామంలో ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు ఇస్తూనే ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నర్సరీలు ఏర్పాటు చేసుకున్నాం.

రైతు సంతోషంగా ఉండాలని రైతుబంధు, రైతు బీమా ఇస్తూనే ప్రతి గ్రామంలో రైతు వేదికలు, రైతు కళ్ళాలు నిర్మాణం చేస్తున్నాం.

ఒకప్పుడు మూడు లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండడం మనం సాధించిన వ్యవసాయ ప్రగతి కి నిదర్శనం. 

భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని పల్లె ప్రకృతి వనాలు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ట్రాలీలు సమకూర్చి ఆ గ్రామంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని నిర్వహిస్తున్న గొప్ప సీఎం కెసిఆర్ . ఇవన్నీ నిర్వహించడానికి, పల్లె ప్రగతి కొనసాగించడానికి ప్రతి నెల రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారు 369 కోట్ల రూపాయలను ఇస్తున్నారు.

 ప్రతి చిన్న గ్రామానికి కూడా ఐదు లక్షల రూపాయలకు తగ్గకుండా నిధులు సమకూరుస్తున్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న ఈ పల్లె ప్రగతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, హరితహారం ద్వారా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి తరిగిపోతున్న అడవులను మళ్లీ పునరుద్దరించుకోవాలని కోరారు.

ములుగు జిల్లా లో పర్యాటకులను ఆకర్షిస్తున్న బొగత జలపాతాన్ని కూడా సందర్శించారు.

మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్ కు జగదీష్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కృష్ణ ఆదిత్య ,అదనపు కలెక్టర్ ఆదర్శ రవి ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: