CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం ఆదేశాలు

Share it:



హైదరాబాద్ :

గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో... మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఆయా రాష్ట్రాల వాల్లు కూడా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తుతున్నారని, ఈ నేపథ్యంలో తెలంగాణలోకి వరద ఉదృతి పెరగనున్నదని  గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ తమ జిల్లాల్లో, తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఈ ప్రాంతాల అన్నిస్థాయిల లోని టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు. గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు.

 ఈ ప్రాంతాల్లోని ప్రజలు కూడా బయటకు వెల్లకుండా ఇండ్లల్లో వుండడమే క్షేమమని సిఎం పునరుద్ఘాటించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితిల్లో  ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుంటూ ఎవరి జాగ్రత్తలు వాల్లు తీసుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులందరూ అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు.

Share it:

SLIDER

Post A Comment: